బీఆర్‌ఏఓయూ దరఖాస్తు గడువు పెంపు



డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏఓయూ) ఎలిజిబిలిటీ టెస్ట్ - 2015 దరఖాస్తు గడువును 14వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ ప్రొ.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షను ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు www. braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.



Followers