భారత్ స్టాక్ ఎక్సేంజీల గురించి మీకు తెలియని నిజాలు?


bhaarat staak eksenjila gurinchi miku teliyani

సాధారణంగా చాలా మందికి స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహాన ఉండదు. స్టాక్ మార్కెట్ల సూచీలు, షేర్ విలువలు గురించి తెలుసుకోవాలని ఏమంత ఆసక్తి కూడా కనబర్చరు. ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్సేంజీల్లో ఉన్న భారత స్టాక్ మార్కెట్ల గురించి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. భారత్‌లో ఉన్న రెండు అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్‌లు ఉన్నాయి. అవి ఒకటి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), రెండవది నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ). ఈ రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. సాధారణంగా స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడింగ్, సూచీలు, లాభాలు, నష్టాలు ఎక్కవగా వింటూ ఉంటాం. వీటితో పాటు చాలా మందికి భారత్ స్టాక్ ఎక్సేంజ్‌ల గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. భారత్‌లో ప్రజలు వారి సొమ్ముని ఎక్కువ భాగం బ్యాంకుల్లో పొదుపు చేసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం 2 శాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఈక్విటీల రూపంలో పొదుపు చేస్తున్నారు. మరికొంత మంది బంగారం కోనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యధిక కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేయబడ్డాయి. రెండింటీలో కలిసి సుమారు 9000 కంపెనీలు లిస్ట్ కాబడ్డాయి. ఎక్కువ షేర్లు కలిగిన కంపెనీగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మొదటి స్ధానంలో ఉండగా, దేశీయంగా ఎల్ఐసీ ఎక్కువ షేర్లు కలిగిన సంస్ధగా స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కాబడి ఉంది. మొత్తం కంపెనీల్లో సుమారు 6000 కంపెనీల షేర్లు అంతంత మాత్రంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కువగా 3000 కంపెనీలకు చెందిన లిస్టెడ్ ట్రేడ్ మాత్రమే ట్రేడ్ అవుతుంటాయి. ఉత్పన్నాల మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ రెండో అతి పెద్ద వాల్యూమ్స్‌ను కలిగి ఉంది. ఇండెక్స్ ఆఫ్షన్స్‌లో రెండో స్ధానంలో ఉండగా, స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. గత మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పట్టేందుకు నెమ్మదిగా తిరిగి వస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 93 లక్షల కోట్లు కాగా జీడీపీలో ఇది 86 శాతానికి సమానం. సెన్సెక్స్, నిఫ్టీ విభాగాల్లో ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్ధాయి ప్రదర్శనను కనబర్చాయి. పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో డబ్బుని పొందారు. 2011, 2012 సంవత్సరానికి గాను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఎలక్ట్రానిక్ బుక్ ఆర్డర్ ద్వారా అత్యధిక ఈక్వీటీ షేర్లలో ట్రేడింగ్ నిర్విహించిన సంస్ధగా రికార్డు సాధించింది.

Followers