బుద్ధునిపై అసభ్యకర యాడ్: న్యూజిలాండ్ దేశీయుడికి రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష


buddhunipai asabhyakara yaad: nyujilaand deshiyudiki rendunnara
మద్యం మత్తులో బుద్దుడి ఫోటోపై మత దూషణకు పాల్పడినందుకు బార్ మేనేజరైన న్యూజిలాండ్ వ్యక్తితో పాటు, మరో ఇద్దరు మయన్మార్ వ్యక్తులకు రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. న్యూజిలాండ్ దేశస్తుడైన ఫిలిప్ బ్లాక్‌వుడ్ విగాస్ట్రో బార్‌‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన బార్‌కు ప్రాచుర్యం కల్పించడానికి బౌద్ధ మత దేవుడు బుద్ధునిపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ బౌద్ధ మత దూషణలో విగాస్ట్రో బార్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు అతనికి సహాయపడిన వారికి కూడా శిక్ష విధించారు. డీజే హెడ్‌పోన్‌లు ధరించిన బుద్ధుని చిత్రాన్ని ఫిలిప్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో పెద్దఎత్తున బౌద్ధ మత మద్దుతుదారులు బార్ ముందు తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన మయన్మార్ పోలీసులు వారి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2011 వరకు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో బౌద్ధమతం ఎక్కువ. ఇటీవల కాలంలో మయన్మార్‌లో తరచుగా మత కలహాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మత హింసలో బౌద్ధులు ముస్లింలను టార్గెట్‌గా చేసుకునేవారు. మయన్మార్
మార్కెట్ రోడ్డులోని విగాస్ట్రో బార్‌లో రెస్టారెంట్, నైట్ క్లబ్ కలిసే ఉంటాయి. బుద్ధుని చిత్రంపై ఫిలిప్ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే బార్‌ను మూసివేశారు. ఇందుకు మయన్మార్ ప్రజలకు క్షమాపణ తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో బార్ యజమాని పేర్కొన్నారు.




Followers