కంప్యూటర్ పనితీరు నెమ్మదించటానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రధానంగా ఇతర
డివైజ్‌ల ద్వారా మీ పీసీలోకి వ్యాప్తిచెందే వైరస్‌లు సిస్టంను పూర్తిగా
దెబ్బతీస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందకపోవటం కూడా పీసీ
పనితీరు పై ప్రభావం చూపుతుంది. మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు
అలానే వాటిని నివారించేందుకు పలు సూచనలను మీ ముందుంచుతున్నాం..
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి.
నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం
వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్
ఏర్పడుతుంది.
చిందర వందరగా డెస్క్‌టాప్
మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్
పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా
తగ్గించివేస్తాయి.
ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన వెంటనే బ్రౌజింగ్ హిస్టరీతో పాటు కుకీలసు
డిలీట్ చేయండి.
మీ పీసీని ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేస్తుండాలి. పీసీ
నెమ్మందిచడానికి పాత సాఫ్ట్‌వేర్ కూడా ఓ కారణం కావొచ్చు.
అనవసర ప్రోగ్రామ్‌లను పీసీ
నుంచి తొలిగించకపోవటం కూడా కంప్యూటర్ నెమ్మదించటానికి ప్రధాన ఓ కారణం.
కాబట్టి, మీ పీసీలోని అనవసర ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్
చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి పీసీ
స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్
వేగాన్ని మందగించేలా చేస్తుంది.
విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్
ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును
మరింత మెరుగుపరుస్తాయి.
సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కంప్యూటర్
వేగం నిదానిస్తుంది. కాబట్టి ఈ రెండింటి పై ఒత్తిడి పడకుండా చూసుకోండి.
పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
లేకుంటే పీసీ పనితీరు నిదానిస్తుంది.
మీ పీసీలో తరచూ ఇంటర్నెట్ వాడుతున్నారా..? అయితే, మాల్‌వేర్స్ రోజు
పెరగుతూనే ఉంటాయి. వాటిని తరచూ స్కాన్ చేస్తూ డిలీట్ చేస్తుండాలి.