యూజీసీనెట్ - జూన్ 2015 UGC NET 2015


దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్) నోటిఫికేషన్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ప్రతి ఏడాది నెట్ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు ఉంటాయి. అయితే ఈ ఏడాది 2015 జూన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. నెట్ పరీక్షలు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం నిర్వహిస్తారు.



నోటిఫికేషన్ విడుదల..


- యూజీసీనెట్ పరీక్షను గత ఏడాది డిసెంబర్-2014 నుంచి సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 84 విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సుమారు 7 నుంచి 8 లక్షల మంది హాజరవుతారు. తెలంగాణలో 22-26 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారు.

- అర్హతలు: పీజీలో సంబంధిత అంశంలో కనీసం 55 శాతం మార్కులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పీజీ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.

-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు జూన్ 1, నాటికి జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యు అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం వయోపరిమితి లేదు.

దరఖాస్తు చేయడం ఎలా ?


పరీక్షకుదరఖాస్తులు చేసేవారు www.cbsenet.nic.in లాగిన్ కావాలి. ఇందులో దరఖాస్తులు నింపడానికి అభ్యర్థి మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి. ఒక పాస్‌వర్డ్‌ను మనం ఎంపిక చేసుకోవాలి. వాటి ద్వారా ఫాంను పూర్తిచేయాలి. పూర్తిచేసిన దరఖాస్తు అనంతరం చలాన్ వస్తుంది. చలాన్‌ను సిండికేట్ బ్యాంకు /కెనరా/ ఐసీఐసీఐ బ్యాంకుల్లో చెల్లించాలి. లేదా ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. దీనికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులలో ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తును సమర్పించాలి. అనంతరం ఒక కాపీని ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షా కేంద్రాలు..


యూజీసీనెట్ పరీక్షను 84 విభాగాలకు నిర్వహిస్తారు. 89 నగరాలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రం నుంచి 22 నుంచి 26 వేల మంది పరీక్షలు రాస్తారు. హైదరాబాద్‌లో 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గత ఏడాది హైదరాబాద్‌లో 22474 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. ఇందులో 16141 మంది పరీక్షలు రాయగా 572 మంది అర్హత సాధించారు.


మార్పులు.. చేర్పులు..


యూజీసీనెట్ పరీక్ష 2015 జూన్‌కు సంబంధించి పలు మార్పులు చేశారు. దరఖాస్తుల ఫీజులు పెంచారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రింట్ దరఖాస్తులు సంబంధిత కో ఆర్డినేటర్ సెంటర్‌లో సమర్పించాల్సిన అవసరం లేదు. గతం లో అడ్మిట్‌కార్డు ఆధారంగా పరీక్ష హాల్‌టికెట్ అందించేవారు. కానీ నేడు హాల్‌టికెట్స్, పరీక్షా కేంద్రాల వివరాలు పరీక్షకు 15 రోజుల మందు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

పరీక్ష సమయాలు.. విధానం


మొదటి పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ పేపర్ ఉదయం 9.30 నిమిషాల నుంచి 10.45 వరకు నిర్వహిస్తారు. అనంతరం పేపర్-2లో 10.45 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మూడో పేపర్ 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షలు రాయాలి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఏ, బీ, సీ, డీలుగా ఉంటాయి. వాటిలో ఒకటి సమాధానంగా గుర్తించాలి.

పరీక్షలు.... ఫలితాలు


జూన్-2015 పరీక్షను జూన్ 28న నిర్వహిస్తారు. నెట్ పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ చివరివారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆయా విభాగాలు, కేటగిరిల వారీ గా ఫలితాలు ఉంటాయి.

ఎంపిక ఎలా చేస్తారు ?


ug-cet-list

యూజీసీ నెట్ పరీక్ష నిబంధనల ప్రకారం మూడు పేపర్లలో అర్హత సాధించాలి. మొదటి పేపర్ (జనరల్)లో అర్హత సాధిస్తేనే మిగత రెండు పేపర్లు మూల్యాంకనం చేస్తారు. మొత్తం మూడు పేపర్లలో టాప్ 15 శాతం మందిని అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. ఇందులో 5 శాతం టాపర్స్‌ను జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.


ఎంపిక ఎలా చేస్తారు ?

యూజీసీ నెట్ పరీక్షకు అర్హత మార్కులు సంబంధిత పేపర్లలో క్వాలిఫై కావాలి. అనంతరం టాప్‌లో నిలిచిన 15 శాతం మందిని ఎంపిక చేసి, విభాగాలు, కేటగిరీలు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) వారీగా 6 నుంచి 7 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
పోటీ అధికంగా ఉన్న విభాగాలు
యూజీసీ నెట్ పరీక్షకు కొన్ని విభాగాలలో పోటీ అధికంగా ఉంది. వీటిలో ఆర్థికశాస్త్రం, ఎంబీఏ, ఇంగ్లీష్, కంప్యూటర్‌సైన్స్, కామర్స్, తెలుగులో పోటీ అధికంగా ఉంటుంది. ఇతర భాషల వారు జపనీస్, అస్సాం లాంటి కోర్సులకు తక్కువగా పోటీ ఉంటుంది.
 ఫెలోషిప్‌లు..
యూజీసీ నెట్ అర్హత సాధించడం ద్వారా అభ్యర్థులు పలు ఫెలోషిప్‌లు పొందవచ్చు. వాటిలో జేఆర్‌ఎఫ్ సాధించినవారికి రూ.25 వేలు అందిస్తున్నారు. సీనియర్ జేఆర్‌ఎఫ్ రూ.30వేలు అందిస్తున్నారు. కంటిజెన్సీల రూపంలో రూ.50వేలు అదనంగా పొందవచ్చు. ఇతర ఫెలోషిప్‌లలో కూడా నెట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. పలు రకాల ఫెలోషిప్‌లకు అర్హతలలో ఒకటిగా ఉంటుంది.
నెట్‌తో ఉపయోగాలు
నెట్‌తో పలు ఉపయోగాలు ఉన్నాయి. జేఆర్‌ఎఫ్ పొందడంతో పాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు అర్హత పొందవచ్చు. పీహెచ్‌డీ ప్రవేశాలలో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పలు ఫెలోషిప్‌లలో కూడా వీటికి అధిక ప్రాధాన్యత, మార్కులు ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్‌కు పదోన్నతులకు అవకాశం ఉంది. ప్రిన్సిపల్ పోస్టులలో కూడాదీనికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫిర్యాదులు.. సమస్యల నివేదన
 యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన వివరాలు www.cbseugcnet.nic.inలో గాని, ఫిర్యాదుల కోసం net@cbse.gov.inలోగాని, ఫ్యాక్స్ నెం 0120-2427 772లోగాని, ఫోన్ నంబర్లు 70423 99524, 70423 99525 నెంబర్లు పనిచేస్తాయి.
ముఖ్యమైన తేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 15
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.cbsenet.nic.in
-పరీక్ష ఫీజు: జనరల్ రూ. 600/, బీసీ అభ్యర్థులకు రూ.300/-. ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.150.
పారదర్శకంగా పరీక్షలు
 నెట్ అర్హతతో విద్యార్థులు పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థులు నెట్ పరీక్ష ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. పరీక్షలను హైదరాబాద్ కేంద్రంలో ఎక్కువగా రాస్తుంటారు. పరీక్ష రాసే అభ్యర్థులను బట్టి కేంద్రాలు నిర్ణయిస్తాం. నెట్‌కు దరఖాస్తులు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా తప్పులు చూసుకోవాలి. ఫొటో ఆప్‌లోడ్‌లో జాగ్రత్తలు అవసరం. దరఖాస్తులు చేసేటప్పుడు అభ్యర్థి తప్పనిసరిగా ఉం డాలి. లాగవౌట్ చేయకపోతే ఫొటోలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఫొటో, సంతకంలో ఏదైనా తప్పులు దొర్లితో వెబ్‌సైట్‌లో ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు.

నెట్ ప్రిపరేషన్ విధానం


నెట్... ఏటేటా క్రేజ్ పెరుగుతున్న జాతీయస్థాయి పరీక్ష. రీసెర్చ్ కోసం కొందరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం మరికొందరు దీన్ని రాస్తారు. 84 విభాగాల్లో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1:

-దీనిలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 ప్రశ్నలకు జవాబు గుర్తిస్తే సరిపోతుంది.

-అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
-ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు.

ఏ ప్రశ్నలు ఇస్తారు?


ఈ పేపర్‌లో మొత్తం 10 విభాగాలు ఉన్నాయి. అవి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, రీడింగ్ కాంప్రెహన్షన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉంటాయి.

- బోధనలో ఉపయోగపడే పద్ధతులు, టెక్నాలజీలను ఎంత ప్రతిభావంతంగా ఉపయోగించుకోగలరు? ఆలోచన ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యం ఎలా ఉంది? తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. విద్యావ్యవస్థపై, పర్యావరణంపై ప్రశ్నలు ఉంటాయి.

-మనోవిజ్ఞానశాస్త్రంలోని నూతన సిద్ధాంతాలు, బోధనాభ్యసన ప్రక్రియలో మార్పులు, నిర్మాణాత్మక సిద్ధాంతం, బోధనలో ఉపాధ్యాయ, విద్యార్థి పాత్రలపై, శిశుకేంద్రిత విద్య, నిరంతర సమగ్ర మూ ల్యాంకనం వంటి అంశాలపై అవగాహన చాలా ముఖ్యం. వీటిపై అనువర్తిత ప్రశ్నలు వస్తాయి. పరిశోధన పద్ధతుల ప్రశ్నలు మౌలిక భావనలనే అడుగుతున్నారు
-ఆధునిక సమాచార సాధనాలు, ప్రసార సాధనాలు, కంప్యూటర్, నెట్, సోషల్‌నెట్‌వర్కింగ్‌ల ప్రభావం బోధనాభ్యసన పరిశోధన ప్రక్రియలో ఎలా ఉపయోగపడగలవో కూడా తెలుసుకోవాలి.

-5, 6, 7 యూనిట్లు అభ్యర్థి అర్థమెటిక్, రీజనింగ్ సామర్థ్యానికి సంబంధించినవి. వీటి గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇవి పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. వీటిపై పట్టుసాధిస్తే కచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అంటే 30 మార్కులు మీకు వచ్చినట్లే.

-మరో ముఖ్యాంశం గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీటి నుంచి లేదా వీటిలో వచ్చిన ప్రశ్నల మాదిరి ప్రశ్నలు కనీసం 20 శాతం రావడానికి ఆస్కారం ఉంది. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలు, జవాబులు యూజీసీ సైట్‌లోఉంటాయి.

పేపర్ 2,3 ప్రిపరేషన్


-ఇవి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి.

-పేపర్ 2లో 100 మార్కులు (50 ప్రశ్నలు, 2 మార్కులు చొప్పున)

-పేపర్ 3లో 150 మార్కులు (75 ప్రశ్నలు, రెండు మార్కుల చొప్పున)

-ప్రస్తుతం మూడు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మూడు పేపర్లను ముఖ్యమైనవిగానే భావించాలి.

-పేపర్ 2,3లో పీజీ స్థాయిలో సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

-పేపర్ -2 కంటే పేపర్ 3లో ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువగా ఉంటుంది.

-పేపర్ 2లో కేవలం ప్రాథమిక భావనలు, వాస్తవాలు,వాటి మధ్య సంబంధాలపైనే ఉంటాయి.

-రెండుపేపర్ల సిలబస్ ఒకటే అయినా పేపర్ 3లో అంశాలు పేపర్ 2లోని అంశాలకు విస్తరింపుగా ఉంటాయి.
-సిలబస్‌లోని ప్రతి అంశాన్ని లోతైన అవగాహనతో చదివితే నెట్‌లో విజయం తథ్యం.

అర్హత మార్కులు


జనరల్ అభ్యర్థులు మొదటి పేపర్‌లో 40 శాతం, రెండో పేపర్‌లో 40 శాతం, మూడో పేపర్‌లో 50 శాతం మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు వరుసగా 35, 35, 40 శాతం మార్కులుగా అర్హతగా నిర్ధారించారు. మొత్తం మూడు పేపర్లకు గాను 350 మార్కులు ఉంటాయి.


Tags:UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result

Followers