ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును గూగుల్ తయారుచేస్తుంది అని
అందరికి తెలిసిందే. ఆండ్రాయిడ్ కొత్త వెర్షను విడుదల చేసిన తరువాత దాని
సోర్స్‌కోడ్‌ని దింపుకొనేదుందుకు వీలుగా ఆండ్రాయిడ్ డెవలపర్ సైటులో
పెడుతుంది. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటారు. తరువాత
ఆండ్రాయిడ్ పరికరాల తయారీదారులు మరియు కస్టం రామ్ విడుదలచేసే
అభివృద్దికారులు ఆ సోర్స్ కోడ్‌ని ఉపయోగించుకొని వారి పరికరాలకు అనుగుణంగా
తయారుచేసి, బాగానే పనిచేస్తుందో లేదో పరిక్షించిన తరువాత అప్‌డేట్‌ని
విడుదల చేస్తుంటారు. దీనికి సుమారుగా మూడు నెలల కన్నా ఎక్కువ సమయం
పట్టవచ్చు. తయారీదారుల ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఇంకా ఆలస్యం కావచ్చు
లేదా అసలు అప్‌డేట్ విడుదలచేయకుండా ఉండవచ్చు. అది పూర్తిగా తయారీదారు
ఆర్ధిక వెసులుబాటును బట్టి ఉంటుంది. అయితే గూగుల్ ముందుగా తను కొత్తగా
విడుదల చేస్తున్న నెక్సస్ పరికరాలను కొత్త వెర్షను ఆండ్రాయిడ్ తో
విడుదలచేస్తుంది. దాని తరువాత నాలుగైదు వారాల్లో గూగుల్ తను విడుదలచేసిన
పాత నెక్సస్ పరికరాలకు అప్‌డేట్ విడుదలచేస్తుంది అది కూడా విడుదలయి రెండు
సంవత్సరాలు దాటని వాటికి మాత్రమే.
నెక్సస్ పరికరాల తరువాత వంతు ఆండ్రాయిడ్ వన్ పరికరాలది. గూగుల్
భాగస్వామ్యంతో విడుదలచేయబడిన ఈ తక్కువ ఖరీదు ఆండ్రాయిడ్ ఫోన్‌లు రావడమే
సరికొత్త వెర్షనుతో వచ్చాయి. గూగుల్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా
వాటికి లాలిపప్ అప్‌డేట్‌ను సాధ్యమైనంత తొదరగా ఇచ్చే అవకాశం ఉంది.
మోటోరోలాను గూగుల్ లినోవోకి అమ్మివేసినప్పటికి తరువాత లాలిపప్
అప్‌డేట్ అందుకువి ఖచ్చితంగా మోటో శ్రేణి పరికరాలే. ఇప్పటికే మోటోరోలా మోటో
ఎక్స్ (ఒకటోతరం, రెండోతరం), మోటోజి (ఒకటోతరం, రెండోతరం), మోటో ఇ, డ్రయిడ్
ఆల్ట్రా, డ్రాయిడ్ మాక్స్ మరియు డ్రయిడ్ మినిలకు అప్‌డేట్ విడుదల్
చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
తరువాత వన్ ప్లస్ వన్. ఇది ఇంకా మన దేశంలో విడుదలకాలేదు.
తొదరలోనే విడుదలచేయాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్ ప్లస్ వన్
ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్ మోడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
హెచ్‌టిసి తన వన్ శ్రేణి పరికరాలకు 90 రోజుల్లో లాలిపప్ అప్‌డేట్
అందిస్తానని ప్రకటించింది. మిగిలిన వాటి గురించి ప్రకటించలేదు.
సోనీ ఎన్ని రోజులలో అప్‌డేట్ విడుదల్చేసానో చెప్పనప్పటికి తన
జెడ్ శ్రేణి పరికరాలకు లాలిపప్ అప్డేట్ తొందరలోనే విడుదల చేస్తామని
ప్రకటించింది.
యల్‌జి కూడా లాలిపప్ అప్డేట్ ఎప్పుడుని చెప్పనప్పటికి జి2 మరియు జి3 కి తొదరలోనే విడుదల చేసే అవకాశాలు అన్నాయి.
సాంసంగ్ కూడా ఇప్పటివరకు తన అప్‌డేట్ ప్రణాళికలను ప్రకటించ లేదు.
అయితే ముందుగా ఎస్5, ఎస్4 మరియు కొత్తగాఈమద్య వచ్చిన నోట్, టాబ్ లకు
అప్డేట్ రావచ్చు. మిగిలిన పరికరాలకు లాలిపప్ ఇస్తుందో లేదో సాంసంగ్
చెప్పవలసిఉంది.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి విడుదయ్యే ఫోన్‌లు చాలా వరకు లాలిపప్ తో రావచ్చు.
తయారీదారులు అప్‌డేట్‌లు ఇవ్వకుండా వదిలేసిన పరికరాలకు కొత్త
వెర్షను రుచిచూపించే సయనోజెన్ మోడ్ సుమారు మూడూ నెలల తరువాత ప్రముఖ
పరికరాలకు సయనోజెన్ మోడ్ 12 ద్వారా స్థిరమైన లాలిపప్ రుచిని చూపించవచ్చు.
ఇంకా ముందుగానే పలు పరికరాలకు సైనోజెన్ మోడ్ అస్థిర విడుదలలు వస్తాయి.