ఏ స్మార్ట్ఫోన్ చూసినా వాట్స్యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది.
సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్లలో వాట్స్యాప్దే ప్రధమస్థానం.
వాట్స్యాప్కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్ వేగంగా
విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్
ఒపెన్సోర్స్ సాఫ్ట్వేర్ కావడం విశేషం. వాట్స్యాప్ని ఫేస్బుక్ కొనుగోలు
చేసినప్పటికి టెలిగ్రామ్ ఇంత పోటి ఇవ్వడానికి కారణం వాట్స్యాప్ ని
మించిన ఫీచర్లే అని చెప్పుకోవచ్చు.
- వాట్స్యాప్ కన్నా వేగవంతంమైనది, తేలికైనది.
- కొంతకాలం తర్వాత కొనుక్కోమని అనదు. ఉచితం మరియు ప్రకటనలు(యాడ్స్) ఉండవు.
- వాట్స్యాప్ వలే కాకుండా ఎన్ని పరికరాలలో అయినా ఇన్స్టాల్ చేసుకొని ఏకకాలంలో వాడుకోవచ్చు.
- ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములతో పాటు అన్ని డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టములలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోండి.
- ఇన్స్టాల్ చేసుకోకుండా వాడుకోవడానికి వెబ్వెర్షను కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి.
- బద్రతకి ప్రాధాన్యతనివ్వడంతో పాటు నిర్ణీత సమయంలో చెరిగిపోయేటట్లు రహస్య సందేశాలను పంపుకునే సౌలభ్యం.
- వాట్స్యాప్ని పోలిన అలవాటయిన ఇంటర్పేజ్తో వాడడం సులభం.
- 200 సభ్యులతో పెద్ద గ్రూప్ తయారుచెసుకోవచ్చు. గ్రూపులో ఆన్లైన్లో ఉన్నవారిని సులభంగా గుర్తించవచ్చు.
- 1జిబి పెద్దపరిమాణం గల ఫైళ్ళను కూడా పంపుకోవచ్చు. వీడియోలు మరియు చిత్రాలే కాకుండా ఎటువంటి పైల్ అయినా పంపుకోవచ్చు.
- పూర్తిగా క్లౌడ్ అధారిత సర్వీసు కావడం వలన ఏ పరికరం నుండయినా ఫైళ్ళను తెరవవచ్చు.
- మెరుగైన నోటిఫికేషన్ సెట్టింగులు.