ఫొటోలు దాచుకోవడానికి గూగుల్‌ నుంచి మరో ప్రత్యేక 'సేవ'


ఫొటోలు, వీడియోలు దాచుకోవడానికి గూగుల్‌ ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. 'గూగుల్‌ ఫొటోస్‌' పేరుతో వినియోగదారులకు మరో కొత్త సేవను ఉచితంగా అందించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న గూగుల్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ కొత్త సేవను ప్రకటించింది. ఈ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఫొటోలు, వీడియోలు భద్రపరుచుకోవచ్చు. గూగుల్‌ ప్లస్‌తో ఎలాంటి సంబంధంలేని ఈ యాప్‌ ద్వారా అపరిమిత మెమొరీని ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం గూగుల్‌ కల్పిస్తోంది. ఇప్పటికే గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ప్లస్‌లలో ఫొటోలు, వీడియోలు భద్రపరిచే సౌకర్యం ఉన్నప్పటికీ పరిమిత మెమొరీలో సాధ్యమవుతుంది. వాటితో పోలిస్తే గూగుల్‌ ఫొటోస్‌లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో హై రిజల్యూషన్‌ ఫొటోలు పెట్టుకోవచ్చు. ఫొటో ఎడిటర్‌, కొలాజ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ సాధనాల్లో యాప్‌ రూపంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. వెబ్‌ ద్వారానూ ఈ ఫొటో సర్వీస్‌ సేవలను వినియోగించుకోవచ్చు. 


Followers