1993 నాటి పేలుళ్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు !


మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి. * తొలి బాంబు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ భవంతి బేస్‌ మెంటులో పేలింది. ఆపై 3:40 వరకూ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. * మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్‌, జవేరీ బజార్‌, కఠా బజార్‌, హోటల్‌ సీ రాక్‌, హోటల్‌ జుహూ సెంటార్‌, ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌, సహారా ఎయిర్‌ పోర్టు, వర్లి, పాస్‌ పోర్టు ఆఫీస్‌ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. * వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. హోటళ్లలో పేలిన బాం బులను బ్రీఫ్‌ కేసుల్లో ఉంచారు. * ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించగా, 700 మంది గాయ పడ్డారు. వీరిలో వందల మంది వివిధ అవయవాలను కోల్పోయారు. * ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ హస్తముందని, అండర్‌ వరల్‌డ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సూచనల మేరకు ఆయన సహచరులు టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌, యాకూబ్‌ మెమన్‌లు ప్రణాళికలు రూపొందించారని విచారణ సంఘాలు గుర్తించాయి. * స్మగ్లర్లు హాజీ అహ్మద్‌, హాజీ ఉమర్‌, తౌఫిక్‌ జలివాలా, అస్లామ్‌ం భట్టి, దూవోద్‌ జాట్‌ లు ఆర్థిక సహాయం అందించారు. * గ్రౌండ్‌ లెవల్‌లో పేలుళ్లకు సహకరించి వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. * బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లు జరిగాయన్న ఆరో పణలు ఉన్నాయి. * పేలుళ్లు జరిపేందుకు నియమించుకున్న వారికి పాకిస్థాన్‌, దుబాయ్‌లలో శిక్షణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ సమకూర్చింది. * పేలుళ్లను ముందుగా పసిగట్టడంలో నిఘా విభాగం, కోస్‌ట గార్‌డ విఫల మైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. * ఇదే కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడని, సాక్ష్యాలను నాశ నం చేసేందుకు ప్రయత్నించాడని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌పై వచ్చిన అభి యోగాలు నిజమేనని కోర్టు తేల్చి శిక్ష విధించింది. అయితే, బాంబులు పేల్చాలన్న ప్లాన్‌ వెనుక ఆయన ప్రమేయం లేదని తేలింది. * పేలుళ్ల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్‌ పవార్‌ ఉన్నారు. * మొత్తం 100 మందిని ఈ కేసులో నిందితులుగా తేల్చారు. * కేసులో ప్రధాన నిందితులు దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌లు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. * ఈ పేలుళ్లు ముంబై అండర్‌ వరల్‌డలో చీలికలు తెచ్చింది. * అప్పటివరకూ దావూద్‌ అనుచరులుగా ఉన్న చోటా షకీల్‌, సాధూ షెట్టి వంటి వారు దావూద్‌ను వీడి బయటకు వచ్చారు.


Followers