దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ (87) మంగళవారం
తెల్లవారుజామున ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో
బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్నారు. 1928 జూన్ 24న
కేరళలోని ఇలపులిలో జన్మించిన ఆయన 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు
నేర్చుకున్నారు. సి.ఆర్.సుబ్బరామన్‌తో కలిసి 'దేవదాసు' 'లైలామజ్ను'
సినిమాలకు పని చేశారు. 'దేవదాసు'లోని 'జగమేమాయ బతుకే మాయ' పాటను ఆయనే
స్వరపరిచారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 సినిమాలకు సంగీత
దర్శకత్వం వహించారు. తెలుగులో 'మరోచరిత్ర' 'అంతులేని కథ' 'గుప్పెడు మనసు'
వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.