
కరెన్సీ నోట్లపై తెల్లగా ఉండే ప్రాంతం (వాటర్‌మార్క్ విండో) లో ఎలాంటి రాతలూ రాయవద్దని దేశ ప్రజలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కోరింది. ఈ ప్రాంతంలో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 'వాటర్‌మార్క్ ప్రాంతంలో కొందరు నంబర్లు వేస్తుంటారు. మరికొందరు పేర్లు, సందేశాలు రాస్తుంటారు. తద్వారా నోటును ఖరాబు చేస్తుంటారు. నోటు అసలో, నకిలీనో తేల్చిచెప్పే సెక్యూరిటీ ఫీచర్లు వాటర్‌మార్క్ ప్రాంతంలోనే ఉంటాయి. అక్కడి రాతల వల్ల నకిలీ నోట్లను గుర్తించడం సామాన్యులకు కష్టమవుతుంది..' అని ఆర్‌బీఐ ఆ ప్రకటనలో పేర్కొంది