తెలంగాణ – ఆంధ్రకు తేడా అదే



ss
తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి ? తెలంగాణలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారు ? తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని .. తమ ఊరికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ? అన్నది సాక్షాత్తు ఆంద్రాకు చెందిన ప్రముఖ సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టంగా తేల్చిచెప్పాడు. ఆయన తన సునిశిత పరిశీలన తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా .. ఏ ఇంటికి వెళ్లినా బాబు ఛాయ తాగుతావా ? అన్నం తింటావా ? అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి .. అతను ఎంత సంపాదిస్తాడు ? అతడు ఎవరు ? అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబు ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు” అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణలో డబ్బుకు ప్రాధాన్యం చాలా తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంతవరకు అతనిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు.

Followers