వైవిధ్యపూ రిత జీవనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుగొనే ఆచరణ మన దేశంలో
శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇవి మన
దేశంలో ఒక పరిపాలన కింద, ఒక రాజ్యాంగం కింద, ఒకే విధమైన న్యాయవ్యవస్థ కింద
అమలు కావడం పలువురికి ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పారు. బృందావనంలో
శ్రీచైతన్య మహాప్రభు ఆగమనానికి 500 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన
ప్రసంగించారు. శ్రీచైతన్యకు మధ్యయుగాల నాటి భారతదేశంలో సంస్కర్తగా,
గౌరవనీయుడైన సాధువుగా పేరు గాంచారు. 'మన నాగరికత విలువల వల్లనే దేశంలో 128
కోట్ల మంది ప్రజలు, దాదాపు అన్ని ప్రధాన మతాలకు చెందిన వాళ్లం
నివసించగలుగుతున్నాం' అని ప్రణబ్ అన్నారు. మన దేశం ప్రజలు ఏడు ప్రధాన
మతాలను ఆచరిస్తున్నారని, 100కు పైగా భాషలను, 1,600 మాండలికాలను మాట్లాడుతు
న్నారని ఆయన చెప్పారు. మూడు ప్రధాన మానవ జాతి సమూహాలు - ద్రావిడులు,
కాకేషియన్లు, మంగోలా యిడ్‌లు ఇక్కడ నివసిస్తున్నారని ఆయన తెలిపారు. ఈశాన్య
ప్రాంతంలో మంగోలాయిడ్‌లు, దక్షిణ భారతంలో ద్రావిడులు, దేశ ఉత్తర, వాయువ్య
ప్రాంతాల్లో కాకేషియన్ జాతికి చెందిన వారు ఎక్కువగా
నివసిస్తున్నారని, ఇలాంటి వైవిధ్యం మన దేశంలోనే కనిపిస్తుందని ఆయన
చెప్పారు. మన సాంస్కృతిక, నాగరికతా విలువల కారణంగానే ఇలా ఉండగలుగుతున్నా
మనీ, వాటిని మనం మన జీవనంలో భాగంగా వృద్ధి చేశామనీ ఆయన అన్నారు. దాద్రీ
సంఘటన తర్వాత రాష్ట్రపతి ప్రతి సందర్భంలోనూ సహనం, తదితర విలువల గురించి తన
ప్రసంగాల్లో చెబుతున్నారనేది తెలిసిందే.