కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి



చిప్‌ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కంప్యూటర్లకంటే కోళ్ల పెంపకం ఉత్తమమని తేల్చిచెప్తున్నారు. చిప్ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం అనే అభిప్రాయాన్ని గేట్స్ వ్యక్తం చేశారు.
చికెన్ అంటే ఏదో ఓ సాఫ్ట్వేర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. పేదరిక నిర్మూలన కోసం బిల్గేట్స్ చూపిస్తున్న కొత్త పరిష్కారం.
పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటేకంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌలభ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపలేవని, పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటే కోళ్ల పెంపకమే సరైన మార్గమని సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ కొత్త భాష్యాన్ని చెప్పారు.
కోళ్ల సంపద ఉంటేకోళ్ల సంపద ఉంటే పేదరికాన్ని సులువుగా పారదోలవచ్చని గేట్స్నోట్స్.కామ్ అనే వెబ్సైట్లో ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం తన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి హీఫర్ అనే సంస్థతో జతకట్టారు.
లక్ష కోడిపిల్లలను దానంఇందులో భాగంగా సబ్ సహారా ఆఫ్రికాలో రెండు డాలర్లు కన్నా తక్కువ రోజువారీ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఒక లక్ష కోడిపిల్లలను మా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్నామని బిల్ గేట్స్ చెబుతున్నారు.
పన్నెండు దేశాలలోపేద దేశాలుగా ఉన్న బోలివియా నుంచి ఆప్రికాలోని బుర్కిన్ పాసా లాంటి పన్నెండు దేశాలలో పేదలను ఆదుకోవడానికి ఈ లక్ష కోళ్లను వినియోగిస్తామని ఆయన చెప్పారు.
దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం ఆఫ్రికా ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు కోళ్ల పెంపకంలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని.. దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం దృష్టికి వచ్చింది అని గేట్స్ తెలిపారు. ఇతర వనరుల కంటే రాబడి కోళ్ల పెంపకంలోనే ఉందన్నారు.
మేకలు, పశువులతో పోల్చుకుంటేచికెన్, గుడ్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతుందని పేర్కొన్నారు. మేకలు, పశువులతో పోల్చుకుంటే కోళ్లు చాలా చిన్నవి.. అవి తక్కువ ప్రదేశంలో పెంపకానికి అనువుగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఆదాయం లభించడం ద్వారా మళ్లీ పెట్టుబడి పెట్టడానికి వీలుంటుందని వెల్లడించారు.
ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లుప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్తో పనిలేదని.. కొందరు కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని.. గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లు సంపాదించగలుగుతారని గేట్స్నోట్స్.కామ్లో ఆయన పేర్కొన్నారు.
గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి


Followers