తెలంగాణ : కొత్తగా 2200 పోస్టులు?

జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపధ్యంలో మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే రెవెన్యూ శాఖలో 2వేలకు పైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం.. మరో 2200 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల పునర్వ్వస్థీకరణతో కొత్తగా 120 మండలాలు, 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్న విషయం విదితమే. ఇప్పటి లెక్క ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు 89 పోస్టులు అవసరమవుతాయి. అది కూడా 1977నాటి లెక్కల ప్రకారం చూస్తే అన్ని పోస్టులు కావాలి. కాగా, ఇప్పుడు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో వాటి జనాభా మరింత పెరిగే వీలున్నందున, పాలన సజావుగా సాగాలంటే కొత్త పోస్టుల మంజూరు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో 2200 పోస్టులు భర్తీ చేసే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. కాగా, జిల్లా, డివిజన, మండలాల పునర్‌వ్యవస్థీరణతో ఇటీవలే రెవెన్యూశాఖకు కొత్తగా 2109 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో చాలా పోస్టులను పదోన్నతుల ప్రాతిపదికన, మరికొన్ని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జేసీ అధికారాలపై నేడే నివేదిక
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారుల అధికారాలకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నివేదిక ఆధారంగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోల అధికారాలను వర్గీకరిస్తూ జీవోనెం.77ను(ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్‌, జేసీ అధికారాల జీవో) సవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది.

Followers