మీది అస‌లైన 4జీ ఫోన్ అవునో, కాదో తెలుసుకోండిలా.!




అస‌లైన 4జీ... ట్రూ 4జీ... నేడు చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న మాట ఇది. 4జీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నాం అని అంద‌రూ అనుకుంటున్నారు కానీ, అస‌లు తాము వాడుతోంది ట్రూ 4జీ ఫోనేనా అని అంద‌రికీ సందేహం క‌లుగుతోంది. ఇంత‌కీ ట్రూ 4జీ అంటే ఏమిటి..?

ట్రూ 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే ట్రూ 4జీ అంటారు. అంటే యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకునే విధంగా ఉంటేనే దాన్ని ట్రూ 4జీ అంటారు. ఈ ట్రూ 4జీ ఉన్న డివైస్‌ల స్పెసిఫికేష‌న్ 4G VoLTE అని ఉంటుంది. అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. అంటే... స‌ద‌రు డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటా మాత్ర‌మే కాదు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.

'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.

Followers