బ్యాంక్ ఆఫ్ బరోడా
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌లో స్వీపర్ కమ్ ప్యూన్ / ప్యూన్ పోస్టుల భర్తీకి
బ్యాంక్ ఆఫ్ బరోడా (జోనల్ కార్యాలయం, బెంగళూరు) నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఇవి ఫుల్‌టైమ్ ఉద్యోగాలు. ఎంపికైన వారిని రూ.9560 - రూ.18545
వేతన శ్రేణిలో నియమిస్తారు.
* మొత్తం ఖాళీలు: 143 (ఎస్సీ - 23, ఎస్టీ - 12, ఓబీసీ - 38, అన్రిజర్వ్డ్ - 70).
* ఖాళీలున్న జిల్లాలు / ప్రదేశాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,
తూర్పు గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, నంద్యాల, కర్నూలు,
గుంటూరు, కడప, అనంతపురం.
* విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే మంచిది.
* వయసు: 16 డిసెంబరు 2016 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మినహాయింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష వ్యవధి 2
గంటలు. మొత్తం 100 మార్కులు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో
(ఇంగ్లిష్ విభాగం మినహాయించి) ఉంటుంది. పరీక్షలో కింది అంశాలు ఉంటాయి.
* తెలుగు భాషా పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు: 30 మార్కులు
* ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు: 10 మార్కులకు.
* జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ అంశాలతో సహా): 20 మార్కులు
* ఎలిమెంటరీ అర్థమెటిక్ / న్యూమరికల్ ఎబిలిటీ: 20 మార్కులు
* సైకోమెట్రిక్ టెస్ట్: 20 మార్కులు
* దరఖాస్తు: ఆన్లైన్లో
* దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు రూ.100.
* చివరి తేది: 16 డిసెంబరు
వెబ్సైట్: www.bankofbaroda.co.in