ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (సెయిల్) ఉద్యోగ ప్రకటనకు అనూహ్యమైన స్పందన లభించింది. సంస్థ ప్రకటించిన 680 ఉద్యోగాలకు ఏకంగా సుమారు 1.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన యువకులు దరఖాస్తు చేసుకున్నారు. రూ.72 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఏటా సుమారు 600 మంది నియామకాలు చేపడుతూ వస్తున్నట్లు ‘సెయిల్’ తెలిపింది.
టెట్ దరఖాస్తులో ఆధార్ సంఖ్య తప్పనిసరి కాదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తు ఫారంలో ఆధార్ నంబర్ నింపడం తప్పనిసరి కాదని టెట్ పరీక్ష నిర్వాహక సంస్థ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రకటించింది. జూలై 2011లో నిర్వహించిన తొలి టెట్ పరీక్షకు ఉన్న సిలబస్, పుస్తకాలే ఇప్పుడూ వర్తిస్తాయని పేర్కొంది. ఇదివరకే టెట్ పరీక్ష రాసినవారు ఆయా పరీక్షల హాల్‌టికెట్ నంబర్‌ల కోసం వెబ్‌సైట్‌లో ‘పాత హాల్‌టికెట్ నంబర్ తెలుసుకోండి’ అనే శీర్షికను క్లిక్ చేసి తెలుసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తులో తప్పులు దొర్లితే ఆగస్టు 2 వరకూ సవరించుకునే అవకాశం ఉందని, ఇందుకు వెబ్‌సైట్‌లో ఉన్న ‘కంప్లైంట్ బాక్స్’ శీర్షికను వినియోగించి సవరించుకోవచ్చని పేర్కొంది. ఇతర అన్ని రకాల సందేహాలకు http://aptet.cgg. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Subscribe to:
Posts (Atom)