సూక్ష్మ జీవులు- వ్యాధులు
సూక్ష్మ జీవులు- వ్యాధులు
- లూయీ పాశ్చర్ ను Father of Microbiology గా పిలుస్తారు.
- సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని " మైక్రోబయాలజీ" లేదా సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
- సూక్ష్మ జీవులను 1674 లో తొలిసారిగా "ఆంటోనీవాన్ లీవెన్ హుక్ " కనుక్కున్నాడు.
- సూక్ష్మ జీవులు - రకాలు: 1. వైరస్ 2. బాక్టీరియా 3. ప్రోటోజోవా 4. శైవలాలు 5.శీలీంధ్రాలు .
వైరస్:
- మొదట వైరస్ లను కనుక్కున్న శాస్త్రవేత్త "ఐవనోవిస్కి"
- వైరస్ అంటే లాటిన్ భాషలో "విషం" అని అర్థం.
- వైరస్ అని పేరు పెట్టిన వ్యక్తి - బైజరింక్.
- వైరస్ లను గురించి చేసే అధ్యయనాన్ని "వైరాలజీ" అంటారు.
- రినోవైరస్ ద్వారా జలుబు
- గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును.
- ఎంటిరోవైరస్ / పోలియో వైరస్ వల్ల .
- కలుషితాహారం నీరు ద్వారా వ్యాపిస్తుంది.
- పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలకనాడులు దెబ్బతింటాయి.
- డెంగ్యు వైరస్ (అర్బో వైరస్)
- ఏడిస్ ఈజిప్టు దోమ ద్వార వ్యాపించింది.
- ఈ వ్యాధి వల్ల రక్తఫలకికలు/ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
- రాబిస్ వైరస్ (రాబ్డోవైరస్)
- రేబిస్ వ్యాధి కేంద్ర నాడీవ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును (హైడ్రోఫోబియా)
- పిచ్చికుక్కకాటు ద్వారా వ్యాపిస్తుంది.
- అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్
- రక్తం, లైంగిక సమ్బంధం, సూదులు, ద్రవాలు ద్వారా వ్యాపిస్తుంది.
- H.I.V వైరస్ ని కనుగొన్న శాస్త్రవేత్త - ల్యూక్ మాంటెగ్నియర్ (పారిస్) ,రాబర్ట్ గాలో (అమెరికా).
- ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు: 1981 వ సం. అమెరికాలో... భారత్ లో 1986 May లో చైన్నెలో(మద్రాస్)
- H.I.V ని గుర్తించడానికి ఉపయోగించి రక్త పరీక్షలు: ఎలీసా, P.C.R, వెస్ట్రన్ బ్లాట్
- ELISA : Enzyme Linked Immuno Sarbent Assay
- ఎలీసా ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో కనుగొన్నారు.
- NACO - నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
- నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణెలో కలదు.
- ఎయిడ్స్ సమాచారం కోసం Toll Free No: 1097
- ఎయిడ్స్ నివారణకు వాడే ఔషదాలు: AZT, DDI, DDC
Subscribe to:
Posts (Atom)