తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు

Universities in Telangana తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు

  • ఆచార్య ఎన్. జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
  • జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?......... హైదరాబాద్
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
  • హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ హైదరాబాద్ (సెంట్రల్ యునివర్సిటీ)
  • ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?............. హైదరాబాద్
  • కాకతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్
  • తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ నిజామాబాద్
  • మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... నల్గొండ
  • శాతవాహన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ కరీంనగర్
  • కుర్రం విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్
  • పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............. మహబూబ్ నగర్

నిరోధకశక్తి కోసం..




lemon

వర్షాకాలం దాదాపు ముగిసిపోయింది. చలికాలం వచ్చేస్తున్నది! ఇలా ప్రతీసారి సీజన్ మారినప్పుడల్లా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు.. తేలికగా అందరికీ వ్యాప్తి చెందుతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మరసంలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం నొప్పుల్ని నివారించడానికి.. వికారాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్‌ను జ్యూస్‌గానూ.. ఇతర ఆహారపదార్థాల్లో చేర్చుకోవడం మంచిది. నిద్రలేమి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. సో.. కావాల్సినంత నిద్రతో శరీరం, మనసుకు విశ్రాంతి దొరికి.. త్వరగా కోలుకుంటారు


Followers