ఈసెట్ - 2016

ఈసెట్ - 2016


డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు బీఈ/బీటెక్‌లో ప్రవేశం కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) - 2016 నోటిఫికేషన్‌ను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విడుదల చేసింది.
వివరాలు: మూడేండ్ల డిప్లొమా కోర్సు లేదా బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన అభ్యర్థులకు ఈసెట్ ద్వారా బీఈ/బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఫార్మసీ అభ్యర్థులకు కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మాలో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు: డిప్లొమా/బీఎస్సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణులైన వారు లేదా ఫైనలియర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 9 నుంచి ప్రారంభం.

చివరితేదీ: ఏప్రిల్ 12
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 500/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 300/-
వెబ్‌సైట్: www.tsecet.in
Tags: ecet counselling 2016  ecet allotment  ecet material  ecet 2016  ecet syllabus  ecet model papers  ecet key  ecet halltickets

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 246 పోస్టులు

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 246 పోస్టులు

బీహార్‌లోని హాజిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ (బ్యాండ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 246కేటాయించిన పోస్టుల సంఖ్య..మహిళలు: 25 (ఓబీసీ- 6, ఎస్సీ- 3, ఎస్టీ- 2, జనరల్- 14)పురుషులు: 221 (ఓబీసీ- 50, ఎస్సీ- 26, ఎస్టీ- 22, జనరల్- 123)సంగీత వాయిద్య పరికరాల వారీగా పోస్టులు..ఫ్లూట్/పికోలొ- 14, ఈబీ క్లారినెట్- 46, ఆల్టో సాక్సాఫోన్- 20, టెనార్ సాక్సాఫోన్- 19, టెనార్/ైస్లెడ్ ట్రంబోన్- 20, బ్రాస్ ైస్లెడ్ ట్రంపెట్- 24, ఫ్రెంచ్ హారన్/హారన్- 12, యుఫోనియం- 19, కార్నెట్- 9, ఈబీ బాస్- 6, సైడ్ డ్రమ్/స్నేర్- 19, బ్యాస్ డ్రమ్- 9, ఒబోయి- 5, కింబాల్- 5, బ్యాగ్‌పైప్- 11, బ్రాస్‌బ్యాస్- 7, ట్యూబా- 1.
నోట్: మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటాయించారు.అర్హతలు: మెట్రిక్యులేషన్/పదో తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌కు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు: 2016, జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీలు, వితంతువులకు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.పే స్కేల్: రూ. 5200- 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/-శారీరక ప్రమాణాలుపురుషులు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 165 సెం.మీ. ఎత్తు, ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 85 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపులు ఉంటాయి.మహిళలు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపులు ఉంటాయి.పరీక్ష విధానం: రాతపరీక్ష (ఓఎమ్మార్ షీట్‌లో), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటాయి.పరీక్ష ఫీజు: రూ. 50. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో. నోట్: పరీక్షను తెలుగులో కూడా రాయవచ్చు.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో, సాధారణ పోస్టులో మాత్రమే పంపాలి. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అభ్యర్థి స్వయంగా తన చేతి రాతతో నింపి, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపర్చి ఐజీ-చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు పంపించాలి.అడ్రస్: IG-Chief Security Commissioner,East Central Railway, Hajipur, Bihar- 844101 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11 వెబ్‌సైట్: www.ecr.indianrailways.gov.in

Followers