చరిత్ర 2013

Tags: 2013 News Round




ఆక్స్ఫర్డ్లో 'ట్వీట్'
ట్వీట్ అనే పదం అధికారిక పదంగా మారింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా పాపులర్ అయిన ట్వీట్ పదం ఆక్స్ఫర్ట్లో చోటు దక్కించుకుంది. 2013జూన్ సంచికలో పదం చేర్చారు. దీనితోపాటు ఫ్లాష్ మాబ్, ఫిస్కల్ క్లిఫ్, డాడ్ డాన్సింగ్ ఎపిక్, ఫాలో, గీకెరీ, పేడే లెండింగ్, సైలెంట్ ట్రీట్మెంట్, బిగ్డాటా, క్రౌడ్ సోర్సింగ్, రీడర్, మౌస్ ఓవర్, రీడైరెక్ట్, స్ట్రీమ్ వంటి పదాలు కూడా ఆక్స్ఫర్డ్లో చోటు చేసుకున్నాయి. ఆక్స్ఫర్డ్లో చోటు చేసుకోవాలంటే పదాన్ని కనీసం పది సంవత్సరాలుగా వాడుతుండాలి.


 

ప్రతీ వేయిలో 61 మంది చిన్నారుల మృతి
ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ప్రతీవేయి మంది పిల్లల్లో 61 మంది ఐదు సంవత్సరాల్లోపే మరణిస్తున్నారు. ఇందులో కూడా 80 శాతం రెండేళ్లలోపే మరణిస్తున్నారు. పౌష్టికాహర లోపం వల్లనే మరణాలుసంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరు నెలల్లోపు ఉన్న చిన్నారుల్లో కేవలం 46 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారు. ఆరునెలలపైగా ఉన్న పిల్లల్లో 57 శాతం మంది ఇతర సప్లిమెంటరీ ఫుడ్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు నేషనల్ ఫ్యామిటీ హెల్త్ సర్వేలో తేలింది. దీంతో తల్లిపాల సంరక్షణ, ఇవ్వాల్సిన ఇతర ఆహార పదార్థాల వివరాలతో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రచారం నిర్వహించనుంది.




హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి
గణిత మేధాని, హ్యూమన్ కంప్యూటర్గా పేరొందిన శకుంతలా దేవి 2013 ఏప్రిల్ 21 మరణించారు. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. 1929 నవంబర్ 4 సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబలో ఆమె జన్మించారు. ఆరేళ్ల వయస్సులో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో, ఎనమిదేళ్ల వయస్సులో అన్నామలై యూనవిర్సటరీలో తన ప్రావీణాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. 1977లో ఆమె 201 అంకెలున్న సంఖ్యకు 23 వర్గాన్ని కేవలం 50 సెకెండ్లలోనే గుణించి చెప్పారు. దీనిని ద్రువీకరించుకోవడానికి శాస్త్రవేత్తలు వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్కు ఫీడ్చేయగా సమాధానం గుర్తించడానికి దానికి నిమిషంపైనే సమయం పట్టింది. 1980లో లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఇలాంటి పరీక్షే మరొకటి పెట్టారు. రెండు పదమూడు సంఖ్యల అంకెను ఇచ్చి గుణించమనగా కేవలం 28 సెకెండ్లలో సమాధానం చెప్పారు. విన్విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ వండర్లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.



జాతీయ పతాక రూపకర్తపై వివాదం
జాతీయ పతాకాన్ని రూపొందించింది ప్రముఖ కాంగ్రెస్ నాయ కుడు బద్రుద్దీన్ త్యాబ్జీ భార్య సురయ్య త్యాబ్జీ అని హైదరాబాద్కు చెందిన కెప్టెన్ ఎల్ పాండురంగారెడ్డి వెల్లడించారు. 1921లో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త దీనిని రూపొందించి గాంధీకి ఇచ్చారని, ఆయనకు నచ్చడంతో వర్కింగ్ కమిటీకి పంపగా అక్కడ ఆమోదం పొందిందనేది కేవలం కట్టుకథ అని ఆయన చెబుతున్నారు. నిజానికి హైదరాబాద్కు చెందిన ముస్లిం మహిళ సురయ్య త్యాబ్జీ దీనిని తయారు చేశారని పాండురంగారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య పుస్తకంలో కూడా వెంకయ్య పేరు రాయలేదని తెలిపారు. 1921 తీర్మానాల్లో కూడా జాతీయ పతాకం ఏర్పాటు జరిగిందనే తీర్మానం కూడా లేదని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంపై ప్రముఖ చరిత్రకారుడు తారాచంద్ రాసిన పుస్తకం 'ఫ్రీడం స్ట్రగుల్ ఆఫ్ ఇండియా'లో కూడా ఎక్కడా వెంకయ్య పేరు రాయలేదు. అంతేకాదు, 1985లో కాంగ్రెస్ పార్టీ శతజయంతి సందర్భంగా వేసిన పుస్తకంలో కూడా జాతీయ పతాక రూపకర్తగా వెంకయ్య పేరు ప్రస్తావనకు రాలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ 1972లో తన పుస్తకంలో పింగళి వెంకయ్య గురించి రాశారని, అయితే ఆందుకు ఆమె ఎలాంటి ఆధారాలు చూపలేదని, అప్పటి నుంచే వెంకయ్య పేరు వ్యవహారంలోకి వచ్చిందని చెప్పారు. నిజానికి సురయ్య తయారు చేసిన జాతీయ పతాక మోడల్ను 1947 జూలై 17 ఆమోదించారని ఇంగ్లీష్ చరిత్రకారుడు ట్రెవర్ రాయలీ తన పుస్తకం ' లాస్ట్ డేస్ ఆఫ్ ది రాజ్'లో పేర్కొన్నారని పాండు రంగారెడ్డి వివరించారు
 


మాలతీ చందూర్
ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ మరణించారు. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. కృష్ణాజిల్లా నూజివీడులో 1928లో ఆమె జన్మించారు. ఆంధ్రప్రభలో ఆమె నిర్వహించిన ప్రమదావనం శీర్షిక 47 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగి రికార్డు సృష్టించింది. ఆమె దాదాపు 30 నవలలు రాశారు. శతాబ్ది సూరీడు, ఆలోచించు వంటివి పేరు పొందాయి. 'చంపకం-చదపురుగులు' ఆమె తొలి నవల. మాలతీ చందూర్ రాసిన 'హృదయనేత్రి'కి 1992లో కేంద్ర సాహిత్య అవార్డు లభించించింది.
నాబార్డ్ ఫౌండర్ చైర్మన్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఫౌండర్ చైర్మన్ ఎమ్ రామకృష్ణయ్య జూలై 22 మరణించారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. రామకృష్ణయ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్, ఒడిషా చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. చరిత్ర పట్ల విపరీతమైన ఆసక్తిగల ఆయన రిటైరయిన తరువాత సాంఘిక సేవలో నిమగ్నమయ్యారు.
క్రైమ్ రచయిత లియోనార్డ్
అమెరికాకు చెందిన ప్రఖ్యాత క్రైమ్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మరణించారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఐదు దశాబ్దాలుగా ఎన్నో హలివుడ్ సినిమాలకు ఆయన నవలలే కథావస్తువులు. తన జీవితం కాలంలో లియోనార్డ్ 46 రచనలు చేయగా వాటిలో చాలా సినిమాలుగా వచ్చాయి. హాలివుడ్ గన్ సంస్కృతి అంతా ఆయన నవలల నుంచి వచ్చిందే. ఆయన 47 నవల బ్లూ డ్రీమ్ సంవత్సరం వెలువడనుంది.





Panchayat Secretary study metirial ap econamy mp3

Panchayat Secretary study metirial  ap econamy mp3, APPSC Panchayat Secretary Exam 2014 Syllabus Pattern.APPSC Panchayat Secretary Exam Syllabus 2014, APPSC Panchayat Secretary,APPSC Panchayat Secretaty Grade-IV Exam Previous Papers, AP Panchayat Raj Secretary Exam Paper-1 Previous Question Paper Download,


09 A.p Economy.mp3 [48876.26 Kb]



 06 Ap Sevala Rangam.mp3 [25060.76 Kb]


 08 Statistics.mp3 [9345.24 Kb]


 05 Cement Parishrama.mp3 [39545.66 Kb]


 01 Rastra Adayamu.mp3 [48708.92 Kb]







More Download  http://telugump3downloads.net





Followers