టాన్స్ ఫార్మర్ ద్వారా AC కరెంట్‌ని ప్రసారం చేసినట్టయితే ఆ ప్రసార నష్టం
తక్కువగా ఉంటుంది. కానీ DC కరెంట్‌ను ప్రసారం చేసినట్టయితే ప్రసార నష్టం
ఎక్కువగా ఉంటుంది.
ఓమ్ : రాబర్ట్ సైమన్ ఓమ్‌ను ప్రవేశపేట్టాడు.
-స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక తీగ ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ దానిలోని
ప్రొటెన్షియల్ తేడాకు అనుపాతంలో ఉంటుంది
iav
i = I/RXV
i = V/R లేదా i = IR లేదా i = V/R
ఈ సమీకరణంలో R = విద్యుత్ నిరోధం
విద్యుత్ నిరోధం :
-ఏదైనా ఒక వలయం గుండా లేదా తీగగుండా విద్యుత్ ప్రవహిస్తున్నా ఆ
ప్రవాహాన్ని అడ్డగించి లేదా వ్యతిరేకించే ధర్మమే విద్యుత్ నిరోధం
-విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓమ్
విద్యుచ్చాలక బలం :
-ఎలక్ట్రానులను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపునకు తరలించడానికి
విద్యుత్‌ఘటం చేసే పనిని విద్యుచ్చాలక బలం(e.m.f) అంటారు.
-దీనికి ప్రమాణం వోల్టు
-విద్యుచ్చాలక బలం అందించు సాధనాలను విద్యుచ్చాలక పీటాలు అంటారు. ఉదా :
విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో.
విశిష్ట నిరోధం :
-వాహక ప్రమాణ పొడవుపై ఉండే నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు.
-విశిష్ట నిరోధానికి ప్రమాణం- వోమ్ మీటర్
రియోస్టాట్ :
ప్రయోగశాలలో విద్యుత్ వలయాల్లోని విద్యుత్ ప్రవాహాన్ని
తగ్గించడానికి/పెంచడానికి ఉపయోగించే పరికరాన్ని రియోస్టాట్ అంటారు.
అతివాహకత్వం :
-ఉష్ణోగ్రతను తగ్గిస్తూపోతే కొన్ని పదార్థాల నిరోధకత ఒకానొక ఉష్ణోగ్రత
వద్ద ఒక్కసారిగా శూన్యమవుతుంది. ఆ ఉష్ణోగ్రతను సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. ఆ
స్థితిలో పదార్థాన్ని అతివాహకం(Super conductor) అంటారు.
-పాదరసం అతివాహక ఉష్ణోగ్రత 4.2 కెల్విన్లు
-అతివాహకత్వంను కనుగొన్న శాస్త్రవేత్త కామన్ లింక్స్ ఓమ్.
విద్యుత్ ప్రవాహంపై ఉష్ణోగ్రత ప్రవాహం :
-ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వాహకాల నిరోధం పెరిగి వాటి ద్వారా ప్రవహించే
విద్యుత్ తగ్గిపోతుంది.
ట్రాన్స్ఫార్మర్ :
తక్కువ వోల్టేజి నుంచి ఎక్కువ వోలేజికి లేదా ఎక్కువ ఓల్టేజి నుంచి తుక్కువ
ఓల్టేజికి విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తారు. ఇది
పరస్పర ప్రేరణ లేదా అనూహ్య ప్రేరణ అను సూత్రం ఆధారంగా అనిచేస్తుంది.
-ఈ సూత్రాన్ని లెంజ్ ప్రతిపాదించాడు.
-ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మొదటి ట్రాన్స్ఫార్మర్ను మైఖేల్ ఫారడే
నిర్మించాడు.
-సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ను సులభంగా అయస్కాంతీకరణం చెందే సాఫ్ట్
ఐరన్‌తో నిర్మిస్తారు.
సోలినాయిడ్ :
ఒక పొడవైన విద్యుద్బంధకపు స్థూపాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ
విద్యుద్బంధకపు పూతగల రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుట్టినట్లయితే
దానిని సోలినాయిడ్ అంటారు. దాని గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే దండయస్కాంతం
వలె అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది.
విద్యుత్ విశ్లేషనం :
విద్యుత్‌ను ఉపయోగించి, సమ్మేళనాలను రసాయనికంగా విభజించి, వాటి మూలకాలుగా
మార్చే ప్రక్రియను విద్యుత్ విశ్లేషనం అంటారు.
విద్యత్ విశ్లేషనం ఉపయోగాలు :
ఎలక్ట్రో ప్లేటింగ్ : ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి, దానిపై
నికెల్ లేదా క్రోమియం పూతను విద్యుద్విశ్లేషణం ద్వారా ఏర్పడేటట్లు
చేస్తారు.
గిల్టినగల తయారీ : తక్కువ ఖరీదుగల ఇత్తడి వంటి లోహంతో నగలు తయారుచేసి
దానిపై విద్యుద్విశ్లేషణం ద్వారా బంగారు పూత పూస్తారు.
లోహ సంగ్రహణం : విద్యుద్విశ్లేషణం ద్వారా లోహ ఖనిజాల నుంచి పరిశుభ్రమైన
లోహాలను పొందవచ్చు.
-విద్యుద్విశ్లేషణం ఉపయోగించి ఎలక్ట్రిక్ ప్రింటింగ్, గ్రామ్‌ఫోన్
రికార్డులు తయారు చేస్తారు.
ఫ్యూజ్ :
ఇది టిన్‌నొడ్ మిశ్రమంతో చేసిన తక్కువ ద్రవీభవన స్థానం గల వైరు ముక్క
బల్బు :
-విద్యుత్ బల్బును థామస్ ఆల్ఫా ఎడిసిన్ కనుగొన్నాడు.
-విద్యుత్ బల్బులో వేడెక్కే భాగం ఫిలమెంట్
-ఫిలమెంట్‌ను సాధారణంగా టంగ్స్టన్తో తయారు చేస్తారు.
-బల్బుల్లో ఆర్గాన్, నియాన్ వంటి జడవాయువులతో నింపుతారు.