పెళ్లయిన కొత్తలో... పొదుపు ఆలోచనలతో..


ఇద్దరి మనసులు కలిసిన శుభ వేళ.. వారిద్దరి ఆలోచనలు ఒక్కటైతే.. మాటల పూతోటల్లో తేలియాడాలన్న భావాలతో జీవిత గమ్యాన్ని 'పొదుపు'బంధంతో ముడివేస్తే.. అవధులు లేని ఆనందానికి మార్గాన్ని సృష్టిచుకుంటారు. ఇదేదో చమత్కారానికో.. లేక పదాతలో ఆకట్టుకోవడానికో అని భావిస్తే మీరూ తప్పులో కాలేసినట్లే... ఇది కొత్తగా పెళ్లైన వారిని ఉద్ధేశించినదే అయినా.. పెళ్లైన వారూ ఇప్పటి నుండైనా క్రయం తప్పకుండా జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలుగా 'ఆర్ధిక' వంతెనను నిర్మించుకోవడం ఎంతో అవసరం. ప్రస్తు తం పెళ్లిళ్ల సీజన్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నేటి తరం వారు ఒక్క అడుగు పొదుపు, వారి జీవితానికి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం ఎంతో అవసరం. వివాహం అనేది జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఒక్క టైన దంపతులు జీవితాంతం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉండాలి. అటువంటి సందర్భంలోనే కష్టాలకు స్వస్తి చెప్పి.. ఆనంద డోలికలల్లో తేలియాడే రోజులు ముందుంటాయి. ఇద్దరి మధ్య అవగాహన ముఖ్యం. అవగాహనతో పాటు సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా ముఖ్యం. కొత్తదంపతుల ఆలొ చనలు సమాంతరంగా ఉంటే.. ఆర్ధిక ఒడుదుడుకులను నెట్టుకు వచ్చే ఓర్పు నేర్పు వాటంతట అవే వస్తాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో కొత్తగా పెళ్ళైన దంపతులు తీసుకోవాల్సిన జాగ్రతలు.. ఆర్ధికాంశాలతో కూడిన ఏడడుగులు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవాలను గుర్తించడం : వివాహం అయిత తరువాత భార్యా భర్తలిద్దరూ పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో మనసువిప్పి మాట్లాడుకో వడం అవసరం. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్న చం దాన.. కష్టాలు నెత్తిన పడ్డాక ఆలోచనలు ప్రారంభించడం అంత మం చిది కాదు. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారిద్దరికి వచ్చే నెల సరి ఆదాయం, ఖర్చులను మొదటి అంచనా వేసుకోవాలి. ఉన్నత చదువుల కోసం ఏదైనా బ్యాంక్‌ రుణాలు పొంది ఉంటే.. వాటిని సాధ్య మైనంత త్వరగా చెల్లించడం ముఖ్యం. తల్లితండ్రులు వారి ఉన్నత విద్యాభ్యాసానికో.. విదేశీ చదువులకో.. విదేశీ ఉద్యోగ అవకాశాలకో రుణాలు పొంది ఉంటే తిరిగి చెల్లించి మంచి రుణ చెల్లింపుల కుటుం బంగా జీవితపు తొలిమెట్టు ఎక్కడంలో ఎంతో సంతోషముంటుంది. మీ ఆలోచనలకు ఆర్ధిక స్థోమతను సరి చూసుకోవాలి : ఇక రెండవ మెట్టు ఎక్కేముందు ఒక్కసారి ఇద్దరి ఆలోచనలకూ పదును పెట్టండి. భవిష్యత్తులో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలి భావిస్తు న్నారు..? ఎలాంటి వాహనాన్ని కొనాలని ఉత్సాహ పడుతున్నారు..? అసలు ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటి..? వాటికి ఎంత ఖర్చు అవుతుంది. ఊహించిన దానికంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే మీరు ఏదైనా బ్యాంక్‌ నుండి రుణ సదుపా యాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలోనే మీరు గతం లో రుణాలు తిరిగి చెల్లించడంలో ఎలాంటి రిమార్క్‌ లేకుండా ఉండ టం ఇప్పుడు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇక ఆలోచిం చేది ఏముంది.. మీ రాబడిని ఊహించి రుణాలకు ప్రయత్నించండి. పొదుపు అలవాటు ఎంతో ముఖ్యం : పె ళ్ళైన కొత్తలో భార్యా భర్తలిద్దరూ చేసే ఖర్చులు ఆతరువాత పరిశీలించి చూస్తే గుండె గుభే లంటుంది. అయితే ముందు నుండీ ఒక ప్రణాళికా బద్ధంగా మీరు చేసే ప్రతీ పైసాని ఒక కాగితంపై రాసిపెట్టుకోవడం ఎంతో అవసరం. అలా చేయడం వల్ల మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి అవసరంగా ఖర్చు చేశారో.. అనవసరమైన ఖర్చులకు వెళ్లిందో తెలుసుకోవడం ఎంతో తేలిక. మీరు ఖర్చుల జాబితాను పరిశీలించిన తరువాత ఆదా యంలోకి కొంత సొమ్మును 'పొదుపు' వైపు మళ్లించుకోవడం కీలక మైనది. మీ జీవితంలో భార్యాభర్తలు కావడంలో ఎటువంటి సంతో షాన్ని అనుభవించారో మీరు చేసే పొదుపు మూలంగా భవిష్యత్తులో అంతకు నూరు రెట్లు సంతోషాన్ని అనుభవిస్తారన్నది సత్యం. ఈ పొదుపును జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవడం ఇద్దరికీ మంచిది. పొదుపు సొమ్ముపై దృష్టి పెట్టండి : ప్రతీ నెలానెలా లేదా ఏటా మీరు చెల్లిస్తున్న పొదుపు సొమ్ముపై మీరు దృష్టి పెట్టాలి. అయితే పొదుపు సొమ్మును ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించ వద్దు. అలాగే ఫిక్సిడ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీనే మీరు ఉపయోగించుకోవాలే తప్ప. వాటి ప్రీమియం కాల పరిమితి పూర్తి కాకుండానే మధ్యలో రద్దు చేసుకోవడం, లేదా వాటిపై అధిక రుణాలు పొందడం కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల ఫిక్సిడ్‌ చేసిన వాటి కాలపరిమితి వరకూ వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు.


జలుబు, గొంతు నొప్పి ఉంటే...ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి....కిడ్నీలు ఫెయిలయితే?

 జలుబు, గొంతు నొప్పి ఉంటే...

గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి గొంతులో పడేలా పుక్కిట పట్టాలి. పుక్కిట పట్టేప్పుడు సుమారు 10నుంచి 15 నిముషాలపాటు చేయాలి. రోజుకు 4నుంచి 6సార్లు పుక్కిట పట్టాలి. చల్లని నీళ్లు, ఐస్‌క్రీమ్‌, కూల్‌డ్రింక్‌ తీసుకున్నవారు వీలైనంత త్వరగా గోరు వెచ్చని నీటితో నీళ్లను పుక్కిలిస్తే జలుబు, గొంతు నొప్పి, బొంగురు గొంతు రాకుండా నివారించుకోవచ్చు. 


ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి

 ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసినదే. కొన్ని రకాల కూరగాయలు సాధారణ ప్రయోజనాలను అందిస్తే, మరికొన్ని రకాల కూరగాయలు మరింత సమర్థంగా పని చేస్తాయి. ఒకే రకానికి చెందిన కూరగాయలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఉదాహరణకు వంకాయ ఊదా రంగులోనే కాకుండా, తెలుపు రంగులోనూ లభిస్తుందనే విషయం మనకు తెలిసినదే. క్యాప్సికమ్‌ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. క్యాబేజ్‌ కూడా తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఇలా భిన్న రంగులున్న కూరగాయలు, పండ్లు ఎంతో సమర్థంగా పని చేస్తాయి. ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పెప్సిన్‌ పదార్థాలు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు యాపిల్‌, టమాటో, బెల్‌ పెప్పర్‌ వంటి ఎరుపు రంగు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. ఎరుపు రంగు క్యాబేజ్‌ ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం. బరువు తగ్గడం రెడ్‌ క్యాబేజిలో నీరు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఊబకాయ సమస్య ఉన్నవారు బరువు తగ్గడానికి ఈ క్యాబేజి జ్యూస్‌ లేదా సలాడ్‌ రూపంలో తీసుకోవడం మంచిది. 



కిడ్నీలు ఫెయిలయితే?

 మన శరీరంలో అనేక క్రియలను నిర్వర్తించే అవయవాల్లో మూత్రపిండాలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి కడుపులో వెనుకభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఛాతీకి కింది భాగంలో ఎముకల మధ్య సురక్షితంగా ఇమిడి ఉంటాయి. ప్రతి మూత్రపిండం సాధారణంగా 10 సెంటీమీర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 150నుంచి 170 గ్రాముల వరకూ ఉంటుంది. మూతపిండాలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను మూత్రవిసర్జన ద్వారా బైటకు పంపుతుంది. వీటితోపాటు శరీరంలో నీటి సమతుల్యత, రక్తపోటు, రక్తపు గడ్డలు, కాల్షియం మొదలైన వాటిని నియంత్రిస్తుంది. మన శరీరంలో ప్రతి రెండు నిముషాలకు రెండు మూత్రపిండాలలో 1200 మిల్లిdలీటర్ల రక్తం శుభ్రమవుతుంది. 24 గంటలలో 1700 లీటర్ల రక్తం శుద్ది అవుతుంది. మూత్రపిండాల వ్యాధి లక్షణాలు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు వాచి ఉండటం ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, వికారంగా అనిపించడం రాత్రిళ్లు ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం చిన్న వయస్సులోనే రక్తపోటు ఉండటం కొంచెం నడిస్తే ఆయాసం, నీరసంగా అనిపించడం ఆరు సంవత్సరాల తరువాత కూడా మంచంపై మూత విసర్జన చేయడం మూత్ర విసర్జన సమయంలో మంట, చీము, రక్తం రావడం, మూతం బొట్లు బొట్లుగా రావడం కడుపులో పుండ్లు కావడం, కాళ్లు, నడుము నొప్పులు పై లక్షణాలు ఏవైనా ఉంటే మూత్రపిండాల వ్యాధిగా అనుమానించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ దీనిలో క్రమబద్ధంగా పని చేస్తున్న మూత్రపిండాల హఠాత్తుగా తక్కువ సమయంలో పని చేయకుండా పోతాయి. దీనికి వాంతులు కావడం, మలేరియా, రక్తపోటు మొదలైనవి ప్రధాన కారణాలు. తగిన మందులు ఇవ్వడం, డయాలిసిస్‌ చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ మూత్రపిండాలు మెల్లమెల్లగా దీర్ఘకాలంలో క్షీణిస్తుంటాయి. శరీరంలో వాపు రావడం, ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, నీరసం, మనస్సు సరిగ్గా లేకపోవడం, తక్కువ వయస్సులోనే రక్తపోటు అధికంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. రక్తపరీక్షలో క్రియాటిన్‌, యూరియాల పరిమాణం ద్వారా మూత్రపిండాలు పని చేసే విధానం గురించి తెలుసుకుంటారు. మూత్రపిండాల పనితీరుమందగించిన కొద్దీ రక్తంలో క్రియాటిన్‌, యూరియా పరిమాణం ఎక్కువవుతుంది. మూత్రపిండాలు అత్యధికంగా పాడైపోతే అంటే సామాన్యంగా క్రియాటిన్‌ 8 నుంచి 10 మిల్లిdగ్రాములు పెరిగినప్పుడు మందులు తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు పాటించినప్పటికీ రోగి పరిస్థితిలో మెరుగు కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు రకాల మార్గాలు ఉంటాయి. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి. డయాలిసిస్‌ శరీరంలో రెండు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు శరీరంలో అనవసరమై, విసర్జించబడిన పదార్థాలు, నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బయటకు పంపించే ప్రక్రియను డయాలిసిస్‌ అంటారు. మిషన్‌ ద్వారా శుద్ధి చేయడం (హీమోడయాలిసిస్‌) ఈ పద్ధతిలో హీమోడయాలిసిస్‌ అనే మిషన్‌ సహాయంతో కృత్రిమ కిడ్నీ (డయలైజర్‌)లో రక్తాన్ని శుద్ధి చేస్తారు. మిషన్‌ సాయంతో రక్తాన్ని శుభ్రపరిచి తిరగి శరీరంలోకి పంపుతుంటారు. రోగి ఆరోగ్యకరంగా ఉండటానికి వారానికి రెండు లేదా మూడుసార్లు డయాలిసిస్‌ చేయాల్సి ఉంటుంది. హీమోడయాలిసిస్‌ చేసుకునే సమయంలో రోగి మంచంపై పడుకుని ఉండగానే ఆహారం తీసుకోవడం, టి.వి. చూడటం వంటి పనులు చేసుకోవచ్చు. ప్రతిసారి డయాలిసిస్‌ చేసుకునేందుకు 4 గంటల సమయం పడుతుంది. పెరిటోనియల్‌ డయాలిసిస్‌ (పొట్ట డయాలిసిస్‌ సిఎపిడి) ఈ పద్దతిలో రోగి మిషన్‌ ఉపయగించుకుండా, నేరుగా ఇంట్లోనే డయాలిసిస్‌ చేసుకోవచ్చు. సిఎపిడిలో ఒక రకమైన అనువుగా ఉండే ఒక పైప్‌ను పొట్టలో అమరుస్తారు. ఈ పైప్‌ ద్వారా ప్రత్యేకమైన ఫ్లూయిడ్‌ను పంపుతారు. కొన్ని గంటల తర్వాత ఆ ద్రవాన్ని మళ్లిd బైటకు తీసినప్పుడు ద్రవంతోపాఉటగా వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. యురినరీ ఇన్‌ఫెక్షన్‌ మూత్రం పోసేప్పుడు మంటగా ఉండటం, మాటిమాటికీ యూరిన్‌ రావడం, బొడ్డు కింద భాగంలో నొప్పి, జ్వరం రావడం యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ ముఖ్య లక్షణాలు. దీన్ని మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో దీనికి చికిత్స ఇస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. చికిత్స ఇవ్వడం ఆలస్యం చేసినా, సరైన చికిత్స ఇవ్వకపోయినా మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. డాక్టర్‌ శ్రీధర్‌ నెఫ్రాలజిస్ట్‌,గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌ సెల్‌ : 9885376705



Followers