బోధన వృత్తికాదు.. జీవన విధానం


-"కాలం కంటే గురువు రెండడుగులు ముందే ఉండాలి -ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకోవాలి "
-"విద్యాబోధన అనేది కేవలం వృత్తిమాత్రమే కాదని, అది జీవన విధానమని" - ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న మార్పులను సునిశితంగా గమణించి, అర్థం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం జరుగనున్న నేపథ్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులకు ఎంపికైన 350మంది ఉపాధ్యాయులతో ప్రధాని గురువారం సమావేశమయ్యారు. ఉపాధ్యాయ వృత్తిపట్ల తన అభిప్రాయాలు, భావాలను వారితో పంచుకున్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయు డు తప్పకుండా కాలం కంటే రెండడుగులు ముందే ఉండా లి. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సమయంలో నాకు రెండు ఆకాంక్షలుండేవి. నా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం, నా గురువులను సముచితంగా గౌరవించటం. ఆ రెండు ఆకాంక్షలను నేను నెరవేర్చుకున్నాను అని తెలిపారు. ప్రతీ విద్యార్థి జీవితంలోనూ గురువు పాత్ర అత్యంత ముఖ్యమైనదని, ఉపాధ్యాయుడికి పదవీ విరమణ అనేదే ఉండదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యావిధానంపై ఉపాధ్యాయులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరందరికీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేయనున్నారు. విద్యార్థుల జీవితాలను వెలిగించండి
By: Namasthe telangaana

ఉరి శిక్ష పడిన వ్యక్తి తీర్పును సవాల్‌ చేయొచ్చు

సుప్రీం కోర్టు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ : మరణ శిక్ష పడిన వ్యక్తి పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను బహిరంగ కోర్టులో విచారించాలని సుప్రీం కోర్టు మంగళవారం రూలింగ్‌ ఇచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిన్లను విచారిస్తుందని పేర్కొంది. ఇప్పటికే రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చిన వ్యక్తులు (మరణశిక్ష పడిన) తిరిగి నెల రోజుల్లోగా తాజాగా పిటిషన్లు దాఖలు చేసకుని తమ వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అంటే దీనర్ధం ఉరి శిక్ష పడిన ఖైదీలు తమకు ఇచ్చిన తీర్పును సవాలు చేయడానికి మరో అవకాశాన్ని ఇవ్వడమన్న మాట. ఒకవేళ సదరు ఖైదీ క్యురేటివ్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్‌ను మళ్ళీ పెట్టుకోరాదని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఐదురుగు న్యాయమూర్తుల బెంచ్‌ 4-1 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది. ఎర్రకోటపై దాడి కేసులో ఉరి శిక్ష పడిన మహ్మద్‌ అసఫక్‌, ముంబయి పేలుళ్ళ సూత్రధారి యాకుబ్‌ మీనన్‌, సోను సర్దార్‌ ఇంకా అనేకమంది తమపై తీర్పును సవాలు చేసేందుకు ఈ ఉత్తర్వులు అవకాశాన్నిచ్చాయి.

Followers