డీఎస్సీ కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు


ఏపీ నిరుద్యోగుల చూపంతా ఇప్పుడు డీఎస్సీపైనే ఉంది. టీచర్‌ జాబ్‌ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ధారపోస్తూ చదువుతున్నారు. మొత్తానికి డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రకటన వస్తుందని గంపెడాశ సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ ఇవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ, తీరా చూస్తే సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన వెలువడలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కూడా డీఎస్సీ ప్రకటన రాలేదు. ఈసారైనా ప్రకటన వస్తుందని గంపెడంత ఆశతో ఎదుచేస్తూ అభ్యర్థులంతా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. 7వేల పోస్టులకే ఆమోదం.. ఏపీలో మొత్తం 10,603 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తొలుత స్పష్టం చేశారు. అయితే వాటిలో కేవలం 7వేల పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. దీంతో అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో ఎస్జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. ఇక డీఎస్సీకి పోటీపడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, 60 వేల మంది డీఈడీ అభ్యర్థులున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం డీఎస్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తడిసి మోపెడవుతున్న కోచింగ్‌ ఫీజులు డీఎస్సీ ప్రకటన వాయిదా పడడంతో అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లకు చెల్లించామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇళ్ల అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి మరీ కోచింగ్‌ తీసుకుంటున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆందోళనలో టెట్ అర్హులు.. డీఎస్సీలో అంతర్భాగంగా టెట్‌ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన 3 లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా? లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రుచూశారు. కానీ ప్రభుత్వ జాప్యంతో అభ్యర్థులంతా ఏం చేయాలో అన్న ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల మండిపాటు డీఎస్సీ ప్రకటన చేస్తామని గొప్పలు చెప్పిన మంత్రి గంటా, ఎందుకు అధికారికంగా సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన చేయలేదని అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని డిమాండ్


Government Telangana GO'S



Government Telangana GO'S TG eGO Register | TG State GOIR Web Portal | Telangana State Government Order Issue Register | TG State GOIR | Download TG GO's From





Government of Telangana  Know more about Telangana Legislative Assembly  GO's on AP Reorganisation Act 2014

Followers