వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకోవటం ఏలా..?


ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు అలానే శ్రేయోభిలాషులకు సోషల్ మీడయా నెట్‌వర్క్స్ అలానే మొబైల్ టెక్స్ట్ మెసెజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వం విధిస్తోన్న తాత్కాలిక ఆంక్షలు కారణంగా అన్ని వేళల్లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సాధ్యం కావటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజిగంగ్ యాప్ వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకునేందుకు పలు తీరదైన దారులను ఇప్పుడు చూద్దాం.... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. అయితే మీ విలువైన సమయాన్ని కాస్తంత వెచ్చించి కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ 'కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి. ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి. వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

భారత అమ్ములపొదిలో స్టెల్త్ యుద్ధనౌక


పూర్తి స్వదేశీపరిజ్ఞానంతో తయారీ -ప్రారంభించిన రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ విశాఖపట్నం, ఆగస్టు 23: రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేసి దేశీయ సంస్థలతోనే యుద్ధనౌకలు, ఆయుధవ్యవస్థలు తయారు చేయిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్‌మెరైన్ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ దేశరక్షణకు అవసరమైన అన్ని పరికరాలు పూర్తిగా స్వదేశీపరిజ్ఞానంతోనే తయారుచేయాలన్నది భారత్ సంకల్పం. ఆ క్రమంలోనే రూపొందిన ఐఎన్‌ఎస్ కమోర్తా దేశానికి సుదీర్ఘకాలంపాటు సేవలందిస్తుందన్న నమ్మకం నాకుంది. భౌగోళికంగా భారత్ చాలా కీలకప్రదేశంలో ఉంది. దేశానికి తీరప్రాంతం కూడా చాలా ఎక్కువ. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న చరిత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే.. భారత్ సైనికపరంగా సర్వసన్నద్ధంగా ఉండ డం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రక్షణ ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న భారత్.. ఇకపై అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం అత్యాధునిక యుద్ధనౌకల తయారీలో ప్రభుత్వ రంగంలోని షిప్‌యార్డులకు, ప్రైవేటు రంగంలోని షిప్‌యార్డులు గట్టిపోటీ ఇస్తున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అరుణ్‌జైట్లీ చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్‌డీ) ఈ నౌకను డిజైన్ చేయగా, కోల్‌కతాలోని ప్రభుత్వరంగసంస్థ గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్‌లో నిర్మించారు. ఇందులోని ఆయుధ వ్యవస్థలతోపాటు, కీలకమైన సెన్సర్లు అన్నీ పూర్తి స్వదేశీపరిజ్ఞానంతోనే తయారయ్యాయి. ఇందులో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగిన స్వల్పశ్రేణి క్షిపణులు (సామ్), రేవతి రాడార్, యాక్టివ్ టోవ్‌డ్ అరే డెకాయ్ సిస్టమ్( ఏటీడీఎస్)తో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది.


Followers