భారత రాజ్యాంగం -బిట్స్



1. రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని ఎవరు వర్ణించారు?
(డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌)
2. ఆత్యయిక పరిస్థితులలో 'ప్రాథమిక హక్కులను' నిలుపు చేసే అధికారం ఎవరికి వుంది? (రాష్ట్రపతి)
3. 'ప్రాథమిక విధులు' ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చ బడ్డాయి? (42వ సవరణ)
4. ఆదేశ సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? (శ్రేయోరాజ్య స్థాపన)
5. ఎన్నవ రాజ్యాంగ సవరణ 'ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై అధిక్యత'ను కల్పిం చింది?(42వ రాజ్యాంగ సవరణ)
6. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి 'ప్రాథమిక హక్కు లకే ఆదేశ సూత్రాలపై ఆధిక్యత' ను కల్పించబడింది?
(44వ సవరణ)
7. మనదేశానికి కార్యనిర్వహణ అధిపతి ఎవరు? (రాష్ట్రపతి)
8. పార్లమెంటు ఆమోదించిన ప్రతి బిల్లు ఎవరి ఆమోదం పొందితేే చట్టమవుతుంది? (రాష్ట్రపతి)
9. 'సామ్యవాద, లౌకిక, జాతీయ సమైక్యత' పదాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు?
(42వ రాజ్యాంగ సవరణ)
10. 'రాజ్యాధిపతిని ప్రజలేఎన్నుకొనే రాజ్యాన్ని' ఏమంటారు?
(గణతంత్ర రాజ్యం)
11. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధి కరణం ఏది?(అధికరణం 370)
12. జమ్మూ - కాశ్మీర్‌ రాజ్యాంగాధి నేతను పూర్వం ఏమని పిలిచే వారు? (సదర్‌-యి-రియాసత్‌)
13. ప్రస్తుతం రాజ్యాంగాధినేతను ఏమని పిలుస్తున్నారు? (గవర్నర్‌)
14. జమ్మూ-కాశ్మీర్‌ ప్రభుత్వ అధినేతను పూర్వం ఏమని పిలిచేవారు?(ప్రధానమంత్రి)
15. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతను ఏమని పిలుస్తున్నారు?
(ముఖ్యమంత్రి)
16. రాజ్యాంగసవరణలో అతి సుదీర్ఘ మైన సవరణ ఏది? (44వ రాజ్యాంగ సవరణ)
17. 'మినీ రాజ్యాంగం' అని పేరు పొందిన సవరణ ఏది? (42వ రాజ్యాంగ సవరణ)
18. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో 'అధికార విభజన' గురించి తెలిపారు?
(7వ షెడ్యూలు)
19. దేశ పాలనకు సంబంధించిన అంశా లను రాజ్యాంగం ఎన్ని జాబితాల క్రింద విభజించింది? (3 జాబితాలు. 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా)
20. కేంద్ర జాబితాలోని పాల నాంశాలపై చట్ట నిర్మాణాధికారం ఎవరికి ఉంది? (పార్లమెంటు)
21. రాష్ట్ర జాబితాలోని పాలనాంశా లపై చట్టాలను ఎవరు ఆమోదిస్తారు?
(రాష్ట్ర శాసనసభ)
22. ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్రాలు ఆమోదించిన చట్టా లలో వైరుధ్యం ఉంటే ఎవరిచట్టం అమలులోకి వస్తుంది? (కేంద్రచట్టం)
23. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం 'ఎన్నికల సంఘం' భారతదేశంలో ఏర్పాటైంది? (నిబంధన 324)
24. ఎన్నికల సంఘానికి అధ్యక్షుడు ఎవరు? (ప్రధాన ఎన్నికల కమిషనర్‌)
25. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఏవిధంగా తొలగించవచ్చు?
(హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా)
26. ప్రధానమంత్రికి ఇచ్చే జీతభత్యాలను ఎవరు యిస్తారు? (పార్లమెంటు)
27. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు కానప్ప టికి, రెండు సభల కార్యకలాపాలలో పాల్గొనే అధికారం ఎవరికి ఉంది? (అటార్ని జనరల్‌)
28. విధి నిర్వహణలో భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలోకి ప్రవేశించే అర్హత ఎవరికిఉంది? (అటార్ని జనరల్‌)
29. మన రాజ్యాంగాన్ని అనుసరించి సార్వ భౌమాధికారం ఎవరి చేతుల్లో వుంది? (ప్రజలు)
30. రాజ్యాంగంను అనుసరించి, మన దేశంయొక్క పేరు ఏమిటి?
(భారత్‌ / ఇండియా)
31. మన రాజ్యాంగంలో 'ప్రాథమిక బాధ్యతలు' అనే అంశాన్ని ఎప్పుడు చేర్చారు? (1976)
32. ఈ మధ్య రాజ్యాంగంలోని ఏ అధి కరణకు సవరణ చేయాలనే అంశం చర్చలోనికి వచ్చింది?
(356వ అధికరణం)
33. 356వ అధికరణం దేనికి సంబం ధించినది? (రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు సంబంధించినది)
34. ఎవరి అధ్యక్షతన 'రాష్ట్రాల పునర్విభజన సంఘం' నియమించ బడింది?
(జస్టిస్‌ ఫజల్‌ అలి)
35. 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏయే భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు?
(నేపాలి, మణిపురి, కొంకణి)

Tags  భారత రాజ్యాంగం -బిట్స్ ,Political Science, Civics, GK Bits, 44వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ,శ్రేయోరాజ్య స్థాపన

Followers