నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు



1) ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను’ అన్నదెవరు?- బాలగంగాధర తిలక్

2) ’డిల్లీ చలో’, ‘జై హింద్’ నినాదాలు ఇచ్చిందెవరు- సుభాష్‌చంద్రబోస్

3) ‘ప్రతి కంటినుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ

4) ‘జై జవాన్- జై కిసాన్’ అన్నదెవరు?- లాల్‌బహదూర్‌శాస్ర్తీ

5) ‘వేదాలకు మరలండి’ అన్నదెవరు?-  దయానంద సరస్వతి


6) ‘ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీలేకుండా మేమందరం అన్నదమ్ములం’అని పలికిన నాయకుడు ఎవరు?
 వి.డి.సావర్కర్

7) ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పిలుపునిచ్చినదెవరు?
 మహాత్మాగాంధీ
8) ‘నాకు రక్తానివ్వండి మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని పలికినదెవరు-  సుభాష్ చంద్రబోస్

9) ‘బెంగాల్ విభజన తర్వాత భారతదేశంలో నిజమైన చైతన్యం పెంపొందిందని బెంగాల్ విభజన దినం బ్రిటీష్ సామ్రాజ్య పతన దినంగా పరిగణించాలని’ పేర్కొన్న జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- మహాత్మాగాంధీ

10) ‘పిచ్చాసుపత్రుల వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు’ అని పలికిన మితవాద నాయకుడు ఎవరు?- గోపాలకృష్ణ గోఖలే

11) ‘అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో గాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న గొప్ప సంఘ సంస్కర్త ఎవరు?
 కందుకూరి వీరేశలింగం

12) ‘రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు’ అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?-అరబిందో ఘోష్

13) ‘ఆధునిక విద్య, విజ్ఞానాలను ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యంకాదు’ అని ప్రబోధించినవారు ఎవరు?-  రాజారామ్మోహన్‌రాయ్

14) ‘హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- సయ్యద్ అహ్మద్‌ఖాన్

15) ‘పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చిందెవరు?-  కార్ల్‌మార్క్స్

16) ‘మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే’ అన్నదెవరు?- రూసో

17) ‘నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు’ అన్నవారు ఎవరు?- అబ్రహం లింకన్

18) 'భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు’ అని పలికిన ఆర్థికవేత్త ఎవరు?- మాల్థన్

19) ‘మానవ పరిణామక్రమాన్ని ఒక గంట సినిమా తీస్తే అందులో 59 ని. శిలాయుగానికే సరిపోతుంది’ అని పలికినదెవరు?- హైమెనీలెనీ

20) ‘నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని’ అన్నదెవరు?- 14వ లూయి 

21) ‘స్ర్తిలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగే..’ అని పిలుపునిచ్చినదెవరు?- ముస్సోలినీ


22) ‘చైనా నిద్రావస్థలో వున్న పెనుభూతం దానికి మెలకువ వచ్చిననాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది’ అని అన్నదెవరు?- నెపోలియన్ బోనపార్టీ 

23) ‘సంగీత విద్వాంసుడు ఫిడేల్‌ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను’ అని ఎవరు అన్నారు?- మొదటి నెపోలియన్

24) ‘స్ర్తి వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది’ అన్నదెవరు?- హిట్లర్

25) ‘యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ’ అని పల్కినదెవరు?- మిరాబో
Tags:నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు ,History, GK Bits, చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

Followers