జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే?


jebulone odigipotaayi!

ఫ్యాషన్‌లో స్లిమ్‌ సైజు ఎలాగో... టెక్నాలజీలోనూ అన్నీ స్లిమ్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి! జేబులోనే ఒదిగిపోతూ... మీ వెంటే మేం అంటూ అలరిస్తున్నాయి! అలాంటి గ్యాడ్జెట్‌లు కొన్ని...ప్రయాణాల్లో జేబులో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటుంది. కానీ, ఎక్కువ సమయం వాడితే ఛార్జ్‌ అయిపోతుంది. మన దేశంలో ఎక్కడంటే అక్కడ ఛార్జ్‌ చేసుకోవడం అసాధ్యం. మరి, ఇలాంటి సందర్భాల్లో జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే? అదెలా సాధ్యం అనే సందేహం అక్కర్లేదు. సింపుల్‌గా పవర్‌ బ్యాంకు గురించి తెలుసుకుంటే సరి. ప్రపంచంలోనే తొలిసారి అత్యంత తక్కువ పరిమాణంలో రూపొందించిన పవర్‌ బ్యాంకు ఇదే. దీంతో రెండు మొబైల్‌ ఫోన్లను ఒకేసారి ఛార్జ్‌ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం కేవలం ఫోన్లనే కాదు. ట్యాబ్లెట్‌లు, ఐపాడ్‌లు, బ్లూటూత్‌, కెమెరాల్ని ఛార్జ్‌ చేయవచ్చు. రెండు డివైజ్‌లను ఛార్జ్‌ చేసేందుకు అనువుగా 'డ్యూయల్‌ యూఎస్‌బీ పోర్ట్‌లు' ఉన్నాయి. అన్ని స్మార్ట్‌ మొబైళ్లను ఇది సపోర్ట్‌ చేస్తుంది. బరువు 250 గ్రాములు. పవర్‌ బ్యాంకు పై భాగంలోని లెడ్‌ ఇండికేటర్ల ద్వారా ఛార్జ్‌ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.3,299. ఇతర వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.మరింత తక్కువ పరిమాణంలో కావాలంటే పవర్‌ బ్యాంకులనువాడొచ్చు. వీటితో యాపిల్‌, నోకియా, ఎల్‌జీ, సోనీ ఎరిక్సన్‌... లాంటి ఇతర కపెంనీ మొబైల్స్‌ ఛార్జ్‌ చేసుకునేందుకు ఏడు రకాల కనెక్టర్లను కూడా పొందొచ్చు. వీటి పవర్‌ సామర్థ్యం ఛార్జ్‌ చేసేందుకు రెండు పోర్ట్‌లు ఉన్నాయి. ఎలాంటి ఒత్తిడికి తగలకుండా ఉండేందుకు రబ్బర్‌ కేస్‌ని ఏర్పాటు చేశారు. వీటి ధర వరుసగా రూ.4,500 రూ.66,500. మరిన్ని వివరాలకు సైట్‌ని చూడండి.ఇంట్లో పీసీలోనూ జేబులో మొబైల్‌లోనూ ఏవైవో ఫైల్స్‌ స్టోర్‌ చేస్తుంటాం. ఫోన్‌ నుంచి పీసీలోకి... పీసీ నుంచి ఫోన్‌లోకి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటాం. అందుకు యూఎస్‌బీ కేబుల్‌ వాడుతుంటాం. కానీ, మీకు తెలుసా? పీసీ, ఫోన్‌కీ అనువుగా వాడుకునేలా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని. ఇదిగోండి కింగ్‌స్టన్‌ కంపెనీ తయారు చేసిన దీనికి రెండు వైపులా రెండు రకాల పోర్ట్‌లు ఉన్నాయి. మైక్రో యూఎస్‌బీ ద్వారా మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌లకు కనెక్ట్‌ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అదే మాదిరిగా యూఎస్‌బీ 2.0 ద్వారా పీసీకి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ఎలాంటి అదనపు సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో వాడుకోవచ్చు. 8 జీబీ (రూ.500), 16 జీబీ (రూ.1200), 32 (రూ.2,200) జీబీల్లో డ్రైవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు డ్రైవ్‌లోకి కాపీ చేసిన సినిమాని ట్యాబ్‌కి కనెక్ట్‌ చేసి హాయిగా చూడొచ్చు. వీడియో, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. సాన్‌డిస్క్‌ కంపెనీ కూడా ఈ తరహా డ్రైవ్‌లను అందిస్తోంది. కావాలంటే డ్రైవ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్‌ 4.0 ఆపై వెర్షన్‌ మోడల్స్‌లో డ్రైవ్‌లను వాడుకోవచ్చు. అలాగే, (ఓటీజీ) అనే ఆప్షన్‌ కూడా మొబైల్‌లో ఉండాలి. దీనికీ రెండు వైపులా పోర్ట్‌లు ఉన్నాయి. మెమొరీ సామర్థ్యం వరుసగా... 16 జీబీ (రూ.1,199), 32 జీబీ (రూ.1,385), 64 జీబీ (రూ.3,800). ఇతర వివరాలకు జేబులో ఫోన్‌ హెడ్‌సెట్‌ పెట్టుకోవడం తెలిసిందే. కానీ, ఎప్పుడైనా స్పీకర్‌ని పెట్టుకుని తీసుకెళ్లారా? ఎక్కడంటే అక్కడ హాయిగా విన్నారా? అయితే, మీరు పోర్టబుల్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో కనిపించే ఈ స్పీకర్‌ని షర్ట్‌ జేబులోనే పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. స్పీకర్‌ సామర్థ్యం బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అనుసంధానం చేసి పాటలు వినొచ్చు. 3.5 ఎంఎం స్టీరియో కేబుల్‌, స్టీరియో జాక్‌ కూడా ఉంది. దీంట్లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ద్వారా 5 గంటలు పాటలు వినొచ్చు. ద్వారా పాటల్ని మరింత క్వాలిటీతో వినొచ్చు. ధర రూ.3,490. మరిన్ని వివరాలకు ఇలాంటిదే మరోటి పోర్టబుల్‌ స్పీకర్‌. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పాటలు వినొచ్చు. ఛార్జ్‌ చేసేందుకు రెండు గంటలు పడుతుంది. వివరాలకు ఛార్జర్‌... యూఎఎస్‌బీ కేబుల్‌... ద్వారా మొబైల్‌ ఫోన్‌ని ఛార్జ్‌ చేయడం తెలుసు? ఆయా ఛార్జర్లు, యూఎస్‌బీ కేబుళ్లను జేబులో పెట్టుకుని వెళ్తుంటాం. కానీ, మరింత సౌకర్యంగా పర్సులో క్రెడిట్‌ కార్డ్‌ మాదిరిగా పెట్టుకుని ఛార్జర్‌ని తీసుకెళ్తే!! అలాంటిదే చిత్రంలో మాదిరిగా దీన్ని పీసీ, కంప్యూటర్‌లకు కనెక్ట్‌ చేసి మొబైల్‌, ట్యాబ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. పైన చెప్పిన పవర్‌ బ్యాంకులు, మొబైళ్ల అనుసంధాన కర్తలా ఈ ఛార్జ్‌కార్డ్‌ పని చేస్తుంది. దీని ధరెంతో తెలుసా? సుమారు రూ.1695. ఇలాంటిదే మరోటి తాళాల గుత్తిలో తాళంలా కలిసిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మొబైల్‌ ఫోన్లలను ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీని ధర సుమారు. రూ.1700. వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.పర్సులో ఛార్జర్లేనా? పెన్‌డ్రైవ్‌ని కూడా కార్డ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు. అదెలా అంటారా? అయితే, తయారు చేసిన మైక్రో యూఎస్‌బీ కార్డ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు చిత్రంలో మాదిరిగా దీన్ని పర్సులో పెట్టుకుని వాడుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ల్లో ఒకటిగా కలిసిపోతుంది. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో పని చేస్తుంది. వీటి మెమొరీ సామర్థ్యం 4 జీబీ, 8 జీబీ. ధర సుమారు రూ.499, 599. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. కార్డ్‌ రూపంలోనే మరిన్ని డ్రైవ్‌లు కావాలంటే తయారు చేసినవి చూడాల్సిందే. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో 4 జీబీ మెమొరీతో యూఎస్‌బీలను తయారు చేశారు. చూడడానికి వీసా, మాస్టర్‌ కార్డ్‌లానే ఉంటాయి. ధర రూ.599. మరిన్ని వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునేలా ఓ ట్రావెల్‌ ఛార్జర్‌ ఉంది. అదే సుమారు 10 రకాల పవర్‌ సాకెట్స్‌ని ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీంట్లోనే మరోవైపు డ్యూయల్‌ యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. వాటితో మొబైల్‌, ట్యాబ్లెట్‌లను ఛార్జ్‌ చేయవచ్చు. ఇది జేబులో ఉంటే ఎలాంటి అడాప్టర్లతో పని లేకుండా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను ప్రయాణాల్లో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.1499.వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.

Followers