చిటికెలో బ్యాక్‌అప్‌!


chitikelo byaakap!


వాడేది స్మార్ట్‌ మొబైల్‌... వేలల్లో కాంటాక్ట్‌లు... ముఖ్యమైన ఫైల్స్‌... ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం! బ్యాక్‌అప్‌ చేసుకోండి! భద్రంగా దాచుకోండి!ప్రయాణంలో మొబైల్‌ పోయింది. చాలా కాంటాక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యమైన ఫైల్స్‌ కూడా. అన్నీ పోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు?లా సమస్య ఏదైనా కాంటాక్ట్‌లను పోగొట్టుకున్న యూజర్లు చాలా మందే ఉంటారు. సరైన పరిష్కారం కోసం వెతుకులాట సాగిస్తుంటారు. మీకు తెలుసా? ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ లేదా రీస్టోర్‌ చేసుకునేందుకు అనువైన ఆప్స్‌, వెబ్‌ సర్వీసులు చాలానే ఉన్నాయి. ఫోన్‌లోనే కాదు... ఎక్కడైనా పొందేలా క్లౌడ్‌స్టోరేజ్‌లోనూ భద్రం చేసుకోవచ్చు. మరింత అనువుగా వాడుతున్న కంప్యూటర్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక ఎప్పుడైనా... ఎక్కడైనా... కాంటాక్ట్‌లు పోయాయే! అనే మాట వినిపించదు. అదెలాగో... అందుకు అనువైన వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!ఒక్కసారి తాకితే చాలు బ్యాక్‌అప్‌ చేయవచ్చు. మరోసారి తాకితే రీస్టోర్‌ చేయవచ్చు. అంత సులువైన యూజర్‌ ఇంటర్ఫేస్‌తో ముందుకొచ్చింది ఆప్‌. ఆప్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకుని హోం స్క్రీన్‌లోని ఆప్షన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం కాంటాక్ట్‌లు బ్యాక్‌అప్‌ అవుతాయి. మెయిల్‌, క్లౌడ్‌, కంప్యూటర్లలో బ్యాక్‌అప్‌ చేసిన ఫైల్‌ని సేవ్‌ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ ద్వారా ఇతర మొబెల్స్‌ ఎక్స్‌టర్నల్‌ మెమొరీలోనూ భద్రం చేసుకునే వీలుంది. ఏదైనా సందర్భంలో బ్యాక్‌అప్‌ చేసుకున్న ఫైల్‌ని రీస్టోర్‌ చేయాలంటే తెరపై కనిపించే గుర్తుపై తాకితే చాలు. చివరిసారిగా ఎప్పుడు బ్యాక్‌అప్‌ చేశారో కూడా డిస్‌ప్లే చేస్తుంది. ఒక్క కాంటాక్ట్‌లే కాదు. స్మార్ట్‌ మొబైల్‌ అన్నాక బ్యాక్‌అప్‌ చేసుకోవాల్సినవి చాలానే ఉంటాయి. మరి, అన్నింటినీ బ్యాక్‌అప్‌ చేసుకోవడానికి ఆప్‌ని వాడొచ్చు. ఆప్స్‌, కాంటాక్ట్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, కాల్‌ లాగ్స్‌, బుక్‌మార్క్‌లు, క్యాలెండర్స్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ మెమొరీ లొకేషన్స్‌లో బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లను జీమెయిల్‌లోకి బ్యాక్‌అప్‌ అయ్యేలా పెట్టుకునే వీలుంది. కావాల్సిన ఆప్స్‌ అన్నింటినీ ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఆటోమాటిక్‌గా బ్యాక్‌అప్‌ అయ్యేలా షెడ్యూల్‌ చేయవచ్చు. 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని మార్చుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... అనివార్యమై ఎప్పుడైనా మొబైల్‌ని 'ఫ్యాక్టరీ రీ సెట్‌' చేయాలనుకుంటే బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని ఇంటర్నల్‌ మెమొరీ నుంచి ఎక్స్‌టర్నల్‌ మెమొరీ (ఎస్‌డీ కార్డ్‌)లోకి మార్చుకోండి. ఫోన్‌ మెమొరీలోనో... ఎస్‌డీ కార్డ్‌లోనో కాకుండా ఎక్కడైనా... ఎప్పుడైనా వాడుకునేలా క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకుంటే? అందుకు అనువైనదే ఆప్‌. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని ఈమెయిల్‌ ఐడీతో క్లౌడ్‌ ఎకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత వచ్చిన హోం పేజీలోని 'బ్యాక్‌అప్‌'పై క్లిక్‌ చేయగానే మొత్తం కాంటాక్ట్‌లు క్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ అవుతాయి. ఇక ఎప్పుడైనా క్లౌడ్‌లోకి సింక్‌ చేసుకున్న కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ లేదా రీస్టోర్‌ చేసుకోవచ్చు. క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి ఆటోమాటిక్‌గా సైన్‌ఇన్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు కూడా. అప్‌లోడ్‌ చేసిన కాంటాక్ట్‌లను ఎప్పుడైనా డిలీట్‌ చేయవచ్చు. వివిధ క్లౌడ్‌స్టోరేజ్‌ సర్వీసుల్ని ఒకేచోట యాక్సెస్‌ చేసుకుని ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే ఆప్‌ అందించే అన్నీ సర్వీసులు తెరపై కనిపిస్తాయి. ముందుగా ఫోన్‌ మెమొరీ, ఎస్‌డీ కార్డ్‌ మెమొరీ మెనూలు కనిపిస్తాయి. తాకుతూ ఆయా లొకేషన్లలో ఉన్న ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఫోన్‌ మెమొరీలో ఉన్న ఫైల్‌ని ఎస్‌డీకార్డ్‌లోకి పంపాలంటే ఫైల్‌ని తాకి ఆప్షన్‌పై తాకితే చాలు. ఇదే మాదిరిగా ఏదైనా డేటాని క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులోకి పంపొచ్చు. ఆప్‌లో బాక్స్‌, పికాస, డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ డాక్స్‌.... లాంటి మరిన్ని సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. ఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకుని క్లౌడ్‌స్టోరేజ్‌ల్లోకి డేటాని పంపొచ్చు. ఉదాహరణకు అడ్రస్‌బుక్‌లోకి కాంటాక్ట్‌లను ఫైల్‌గా క్రియేట్‌ చేసుకుని క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్లో భద్రం చేసుకోవచ్చు. ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులు చూడకుండా 'ప్రైవేట్‌ మోడ్‌'లోకి మార్చుకోవచ్చు. కాంటాక్ట్‌లు, కాల్‌ లాగ్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, బ్రౌజర్‌ బుక్‌మార్క్‌లు, క్యాలెండర్‌లను సులువుగా బ్యాక్‌అప్‌, రీస్టోర్‌ చేసుకునేందుకు మరో ఆప్‌ గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ద్వారా ఫోన్‌ మెమొరీ, ఎస్‌డీ కార్డ్‌ల్లోకి కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు.ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి బ్యాక్‌అప్‌ చేసుకునే వీలుంది. ఐఫోన్‌ యూజర్లు కాంటాక్ట్‌లు, ఇతర డేటాని భద్రం చేసుకునేందుకు ఆప్‌ని వాడొచ్చు. ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. హోం స్క్రీన్‌లోని 'బ్యాక్‌అప్‌'పై క్లిక్‌ చేసి అన్ని కాంటాక్ట్‌లను భద్రం చేయవచ్చు. బ్యాక్‌అప్‌ చేసిన ఫైల్‌ని మెయిల్‌ చేసుకోవడమే కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది. రీస్టోర్‌ చేసుకోవడం కూడా చాలా సులువు. ఇలాంటిదే మరోటి ఆప్‌. లోకల్‌ ఫోన్‌ మెమొరీల్లోనే కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ల్లోనూ బ్యాప్‌అప్‌ కాపీని స్టోర్‌ చేయవచ్చు. వీసీఎఫ్‌ ఫార్మెట్‌లో సేవ్‌ చేసుకున్న ఫైల్‌ని సీఎస్‌వీ ఫార్మెట్‌లోకి ఎక్స్‌పోర్ట్‌ చేసుకుని ఎక్సెల్‌ స్ప్రెడ్‌షీట్‌లానూ యాక్సెస్‌ చేయవచ్చు. యాంటీవైరస్‌లా ఫోన్‌కి రక్షణ వలయంలా పని చేస్తూనే మీ ఫోన్‌ కాంటాక్ట్‌లను సురక్షితం చేస్తుంది ఆప్‌. కావాలంటే ప్రయత్నించి చూడండి. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు దీన్ని ఆయా ఆప్‌ స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ట్రాకింగ్‌, రిమోట్‌ యాక్సెస్‌, ప్రైవరీ చిట్కాల్ని అందిస్తూనే ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ చేస్తుంది. బ్యాప్‌అప్‌ కాపీని సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌, ట్యాబ్‌లోకి బ్యాక్‌అప్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని రీస్టోర్‌ చేసుకోవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ మొబైల్‌ వాడితే ఆప్‌తో ఫోన్‌లోని అడ్రస్‌బుక్‌ని సులువుగా సురక్షితం చేసుకునే వీలుంది. వీసీఎఫ్‌ ఫార్మెట్‌లో ఫైల్‌ని క్రియేట్‌ చేసుకుని మైక్రోసాఫ్ట్‌ అందించే క్లౌడ్‌స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన బ్యాక్‌అప్‌ ఫైల్‌ని లోకల్‌ మెమొరీలో కూడా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌ని చూడండి. క్వర్టీ కీప్యాడ్‌తో అలరించే బ్లాక్‌బెర్రీ సంగతేంటి? అనే వారికి ఆప్‌ ప్రత్యేకం. ఫోన్‌, ఎస్‌డీకార్డ్‌ మెమొరీలతో పాటు ఈమెయిల్‌కి కాంటాక్ట్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆటోమాటిక్‌గా కాంటాక్ట్‌లు బ్యాక్‌అప్‌ అయ్యేలా సెట్‌ చేసుకునే వీలుంది. 'రీస్టోర్‌ ఆల్‌' ద్వారా అన్ని కాంటాక్ట్‌లను తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని పీసీలోకి బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు అనువైన వారధులు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి. సైట్‌లోకి వెళ్లి పీసీ వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫోన్‌లోని అడ్రస్‌బుక్‌ని పీసీలోనూ యాక్సెస్‌ చేయవచ్చు. కాంటాక్ట్‌లను మేనేజ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు అడ్రస్‌బుక్‌లోని వందల కాంటాక్ట్‌లను పీసీలోనే ఎడిట్‌ చేసుకోవచ్చు. కొత్త నెంబర్లను అడ్రస్‌బుక్‌కి జత చేయవచ్చు. అక్కర్లేని కాంటాక్ట్‌లను డిలీట్‌ చేసి అప్‌డేట్‌ చేయవచ్చు. అన్ని కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకుని కావాల్సినప్పుడు రీస్టోర్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌ ఆప్‌ ద్వారా మరో అదనపు ప్రయోజనం ఏంటంటే... అందుబాటులో ఉన్న ఆప్‌ స్టోర్‌ల్లోని ఆప్స్‌, గేమ్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫోన్‌లో వాడుకోవచ్చు. ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎక్సెల్‌కి అనువుగా మార్చుకుని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఎస్‌డీకార్డ్‌లో సేవ్‌ అయిన ఫైల్‌ని ఎక్సెల్‌లో కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకోవచ్చు.అడ్రస్‌బుక్‌ మొత్తాన్ని టెక్స్ట్‌ ఫార్మెట్‌లోకి మార్చుకుని పొందేందుకు అనువైంది. హితుడి ఫోన్‌ నెంబర్‌ మారితే! అతను వ్యక్తిగతంగా చెప్పేంత వరకూ మీకు తెలియదు. అలాగే, మీ మొబైల్‌ నెంబర్‌ మారితే... మీరు చెప్పేంత వరకూ మీ స్నేహితుల్లో ఎవ్వరికీ తెలియదు. ఈ గ్యాప్‌ లేకుండా అందరూ ఎప్పుడూ టచ్‌లోనే ఉండాలంటే? వాడితే సరి. ఈ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని స్నేహితులు గ్రూపుగా ఏర్పడితే చాలు. ఎవరి నెంబర్‌ మారినా అందరి ఫోన్లలోనూ ఇట్టే అప్‌డేట్‌ అవుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు కాంటాక్ట్‌లను క్లౌడ్‌ స్పేస్‌లో బ్యాక్‌అప్‌ చేస్తుంది కూడా. ఇతర వివరాలకు సైట్‌లోకి వెళ్లండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. ఐఫోన్‌ వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌ నుంచి పొందొచ్చు.

Followers