టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు:
భారతీయ పురుష అభ్యర్థులు అర్హులు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం
నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2014, జూన్, 30 నాటికి వయస్సు 18 -42
ఏళ్ల మధ్య ఉండాలి. ఆర్మ్‌డ్ ఫోర్సెస్/పోలీస్/పారా మిలటరీ బలగాల్లో పనిచేసే
వారు అర్హులుకారు. సెంట్రల్ గవర్నమెంట్/సెమీ గవర్నమెంట్/ప్రైవేట్
సంస్థల్లో/స్వంత వ్యాపారం/స్వయం ఉపాధి చేసుకొనే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. దీనిలో సెలెక్ట్
అయిన వారికి సర్విస్ సెలక్షన్ బోర్డు, మెడికల్ బోర్డు పరీక్షలను
నిర్వహిస్తాయి. అనంతరం ఫైనల్ మెరిట్‌లిస్ట్‌ను ప్రకటిస్తారు.
రాతపరీక్షను ఆగస్టు 10న నిర్వహిస్తారు. పార్ట్-1లో షార్ట్ ఎస్సే, పార్ట్-2
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్‌నెస్‌పై ఉంటుంది. దీనిలో
పొలిటికల్ సైన్స్/ఎకనామిక్స్, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు: సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు
సంబంధిత సర్టిఫికెట్స్‌తోపాటు రెండు సెల్ఫ్ అడ్రస్ కవర్లను జతచేసి పంపాలి.
చివరితేదీ: జూన్ 30
ఉద్యోగానికి ఎంపికైన వారికి లెఫ్టెనెంట్ హోదాను ఇస్తారు. రెగ్యులర్ ఆర్మీ
ఆఫీసర్స్‌కు ఇచ్చే జీతభత్యాలు వీరికి కూడా ఇస్తారు. వివిధ పరీక్షల ద్వారా
పదోన్నతులు పొందవచ్చు. పార్ట్‌టైం ఉద్యోగంతో పూర్తిస్థాయి ఉద్యోగ హోదాలను,
గౌరవాన్ని ఈ ఉద్యోగాల ద్వారా పొందవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
www.indianarmy.gov.in చూడవచ్చు