RBI Bank Jobs 2014



aarbiailo  aafisar udyogaalu..
బ్యాంకులకు రారాజు ఆర్‌బీఐ. దీనిలో ఉద్యోగాలంటే చాలా క్రేజ్. మంచి జీతభత్యాలు. పదోన్నతులకు పుష్కలంగా అవకాశాలు. ఏటా నోటిఫికేషన్ల ద్వారా పలు ఉద్యోగాలను ఆర్‌బీఐ భర్తీ చేస్తుంది. గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఉద్యోగ వివరాలు.... రిజర్వ్‌బ్యాంక్: 1935, ఏప్రిల్ 1న రిజర్వ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. 1934 యాక్ట్ ప్రకారం దీన్ని ప్రారంభించారు. 1949లో దీన్ని జాతీయం చేశారు. ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ డా. రఘురాం రాజన్. ఆర్‌బీఐ దేశీయ ఆర్థిక విధానాలను సమీక్షిస్తుంది. ఫారెన్ ఎక్సేంజ్, కరెన్సీ విడుదల తదితర ఆర్థిక అంశాలను ఇది నిర్వహిస్తుంది. ఉద్యోగ వివరాలు: గ్రేడ్ - బీ ఆఫీసర్(జనరల్) ఉద్యోగాలు. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 117. వీటిలో జనరల్-58, ఎస్సీ-15, ఎస్టీ -8, ఓబీసీ -36 ఖాళీలు ఉన్నాయి. పై పోస్టుల్లో నాలుగు పోస్టులు పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. ముఖ్యతేదీలు: దరఖాస్తును ఆన్‌లైన్‌లో జూన్ 23లోగా దాఖలు చేయాలి. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్‌లో చివరితేదీ: జూన్ 23 ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 26 అర్హతలు: 2014, జూన్ 1 నాటికి 21 -30 ఏళ్ల మధ్య ఉండాలి. 1984, జూన్ 2 నుంచి 1993, జూన్ 1 మధ్యలో జన్మించిన వారు అర్హులు. అదేవిధంగా పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తిచేసిన అభ్యర్థుల వయస్సు 31 -33 ఏళ్ల వరకు ఉండవచ్చు. విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. డాక్టొరేట్ డిగ్రీ అయితే 50 శాతం మార్కులతో, ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. రాతపరీక్షను రెండంచెల పద్ధతిలో నిర్వహిస్తారు. మొదటి దశ: ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ మోడ్‌లో ఉంటుంది. ఇది 200 మార్కులకు నిర్వహిస్తారు. ఆగస్టు 2/3/9/10 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పేపర్‌లో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి 130 నిమిషాలు. ప్రతి సెక్షన్‌లో కనీసం మార్కులు తప్పనిసరిగా రావాలి. ఫేజ్ -1లో అన్ని విభాగాల్లో అన్ని సెక్షన్స్‌లో కనీస మార్కులు వచ్చిన వారికి ఫేజ్ -2 పరీక్షకు అనుమతిస్తారు. రెండో దశ: ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కనీస మార్కులను బోర్డు నిర్ణయిస్తుంది. ఫెజ్ -2 రాత పరీక్ష: ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనిని సెప్టెంబర్/అక్టోబర్ 2014ల్లో నిర్వహిస్తారు. దీనిలో పేపర్ -1లో ఇంగ్లీష్, పేపర్ -2లో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూలపై, పైపర్ -3లో ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌పై పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 100. కాలం మూడుగంటలు. Syllabus (Phase-II): (i) Paper I English: Essay, Precis writing, Comprehension and Business/Office Correspondence. (ii) Paper II Economic and Social Issues: Growth and Development Measurement of growth: National Income and per capita income Poverty Alleviation and Employment Generation in India Sustainable Development and Environmental issues. Economic Reforms in India Industrial and Labour Policy Monetary and Fiscal Policy Privatization Role of Economic Planning. Globalization Opening up of the Indian Economy Balance of Payments, Export-Import Policy International Economic Institutions IMF and World Bank WTO Regional Economic Co-operation. Social Structure in India Multiculturalism Demographic Trends Urbanization and Migration Gender Issues Social Justice : Positive Discrimination in favour of the under privileged Social Movements Indian Political System Human Development Social Sectors in India, Health and Education. (iii) Paper III Finance and Management: Finance :The Union Budget Direct and Indirect taxes; Non-tax sources of revenue; Outlays; New Measures; Financial Sector Reforms; Capital Market, Money Market and Foreign Exchange Market; Stock Exchanges and their Regulation; Capital Market Intermediaries and their Regulation; Role of SEBI; Functions of the Money Market; Growth and Operation of the Money Market; The Foreign Exchange Market; From FERA to FEMA; Exchange Rate Management; Exchange Risk Management; Role of Banks and Financial Institutions in Economic Development; Regulation of Banks and Financial Institutions; Disinvestment in Public Sector Units. Management: Management: its nature and scope; The Management Processes; Planning, Organization, Staffing, Directing and Controlling; The Role of a Manager in an Organization. Leadership: The Tasks of a Leader; Leadership Styles; Leadership Theories; A successful Leader versus an effective Leader. Human Resource Development: Concept of HRD; Goals of HRD; Performance Appraisal Potential appraisal and development Feedback and Performance Counseling Career Planning Training and Development Rewards Employee Welfare. Motivation, Morale and Incentives: Theories of Motivation; How Managers Motivate; Concept of Morale; Factors determining morale; Role of Incentives in Building up Morale. Communication: Steps in the Communication Process; Communication Channels; Oral versus Written Communication; Verbal versus non-verbal Communication; upward, downward and lateral communication; Barriers to Communication, Role of Information Technology. Corporate Governance: Factors affecting Corporate Governance; Mechanisms of Corporate Governance. పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కోదాడ, కరీంనగర్, వరంగల్‌ల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.rbi.org.in

http://rbi.org.in/scripts/vaccancies.aspx

Followers