
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన
పార్టీపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విషయం ఏంటంటే,
50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టి, ఆ
నోటును ఫేస్ బుక్ లో అప్ చేశారు.
దీన్ని జనసేన పార్టీ పెట్టిందని ఆరోపిస్తూ
కేసు పెట్టారు. గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి మహాత్మా
గాంధీని కించపరచారని మండిపడ్డారు. జనసేన పార్టీపై చర్యలు తీసుకోవాలని
న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.