ఇంపార్టెంట్ టెన్త్ పేపర్స్


తొమ్మిది, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి. 2014-15 విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అవుల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమల్లో ఉండగా, ఇప్పుడు 9, 10 తరగతులకు కూడా ఇది వర్తింప జేస్తున్నారు. పదో తరగతి పరీక్షా పేపర్ల సంఖ్యలో మార్పులేదు. ఇప్పుడు కూడా 11 పేపర్లే ఉంటాయి. 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులకు అంతర్గత మూల్యాంకనం ఉంటుంది. అయితే విద్యార్థులు 80 మార్కులలో 28 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మొత్తం 100 మార్కులకు మాత్రం 35మార్కులు వస్తేనే పాస్‌ అయినట్లు పరిగణిస్తారు. మూల్యాంకనంలోనూ పలు మార్పులు చేశారు. అంతర్గత మూల్యాంకనానికి మార్కులు నిర్ణయించలేదు. పరీక్షల సంస్కరణల అమలుపై ఈ ఏడాది మే 14న జారీచేసిన ఉత్తర్వుల (జీ.వో.ఎం.ఎస్‌.నెం.17)కు పలు వివరణలు, సవరణలు చేస్తూ తెలంగాణ విద్యాశాఖా కార్యదర్శి వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పేపర్‌లోనూ 80 శాతం వూర్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా 20 శాతం వూర్కులకు అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు. పరీక్షల సవుయాల్లో స్వల్పంగా వూర్పులు చేశారు. ఇప్పటి వరకు అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 2.30 గంటల సవుయం కేటాయిస్తుండగా, ఇకపై లాంగ్వేజెస్‌కు 3 గంటలు కేటాయించారు. ఇందులో ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు ప్రత్యేకించారు. ఇక నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల విషయానికి వస్తే పరీక్షకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల సవుయం కేటాయించారు. ఇప్పటి వరకు సెకండ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/హింది) మినహా మిగతా సబ్జెక్టులకు పాస్‌ మార్కులు 35 శాతం కాగా సంస్కరణల్లో భాగంగా ఇకపై అన్ని పేపర్లలోనూ 35 శాతం వూర్కులు వస్తేనే పాస్‌ అయినట్లు పరిగణిస్తారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ నాలుగు సార్లు నిర్వహించి వాటి సగటును లెక్కిస్తారు. ఆ వూర్కులను పాఠశాల విద్యా సంచాలకునికి పంపిస్తారు. పాఠశాలకు వెళ్లి చదువుకోని ప్రైవేట్‌ అభ్యర్థులు ఓపెన్‌ స్కూలు పద్దతిలోనే పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పాఠశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఈ సంస్కరణలు వర్తిస్తాయి. మార్కుల పంపిణీ.(సవరించిన గ్రేడింగ్‌ టేబుల్‌ గ్రేడ్‌ మార్కుల గ్రేడ్‌ పాయింట్లు) ఎ1 91-100 10 ఎ2 81-90 9 బి1 71-80 8 బి2 61-70 7 సి1 51-60 6 సి2 41-50 5 డి 35-40 4 ఇ 0-34 3


Followers