Table1కళాశాల గురించి
IIFT ఎంట్రన్స్ పరీక్ష ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT)
అడ్మిషన్ కోసం రాయాలి. ఈ కళాశాలను 1963లో భారత ప్రభుత్వం స్థాపించింది. ఈ
కళాశాల నిలకడగా ప్రతి ఏడాది టాప్ 20 ఎంబీఏ కళాశాలలో ఒకటిగా గుర్తింపు
పొందుతూ ఉంది. ఈ కళాశాలను భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్య నిర్వహణ, మానవ
వనరులను అభివృద్ధి పరచడం ద్వారా ఎగుమతులు పెంచడం, ఉన్న డేటాని విశ్లేషించి,
పరిశోధన నిర్వహించడంలాంటి వాటికోసం స్థాపించింది. ఈ కళాశాలకు రెండు
క్యాంపస్‌లు ఉన్నాయి. ఢిల్లీలోని క్యాంపస్‌లో 150-160 సీట్లు ఉంటాయి.
కోల్‌కత్తా క్యాంపస్‌లో 60 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాల ఇంటర్నేషనల్ బిజినెస్
(MBA-IB)లో ఎంబీఏ అందిస్తుంది. మొత్తం వార్షిక ఫీజు రూ. 6.75 లక్షలు
table2IIFT అడ్మిషన్ ప్రక్రియ
అన్ని టాప్ కళాశాలల లాగానే IIFTలో కూడా రెండు దశల ప్రవేశ ప్రక్రియ
ఉంటుంది.
1.IIFT ప్రవేశ
పరీక్ష
2. గ్రూప్ అభ్యాసం, ఎస్సే రైటింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
మాకున్న అనుభవాన్ని బట్టి IIFT వెబ్‌సైట్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా
ప్రతి రౌండ్ వెయిటేజీ ఈ విధంగా ఉంటుంది.
రాతపరీక్ష: 65 శాతం (గ్రూప్ డిస్కషన్-10 శాతం, ఎస్సే రైటింగ్-10 శాతం,
పర్సనల్ ఇంటర్వ్యూ15 శాతం)
table3IIFT ప్రవేశ పరీక్ష..
ఈ పరీక్ష గురించి అత్యంత కష్టమైనా విషయం పరీక్ష ప్యాటర్న్ ఊహించడం. ప్రతి
ఏడాది ఏదో ఒక మార్పు వస్తూనే ఉంది. 5 నుంచి 6 ఏళ్లుగా ప్రశ్నల సంఖ్య, ప్రతి
ప్రశ్నకు మార్కులు, సెక్షన్ల సంఖ్య మారుతూనే ఉంది. ఈ మార్పులే ఈ పరీక్షని
మిగతా వాటి కంటే కష్టంగా చేస్తున్నాయి. మార్పు లేకుండా ఉన్నవి మొత్తం
మార్కులు, పరీక్ష సమయం. పరీక్షలో మొత్తం 100 మార్కులు , మొత్తం table4సమయం
120 నిమిషాలు (రెండు గంటలు). పరీక్షలో ముల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షలో రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్‌నాలెడ్జ్ అవగాహన, లాజికల్ రీజనింగ్,
క్వాంటిటేటివ్ ఎనాలిసిస్‌లో నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంతకు ముందు
చెప్పినట్టు ప్రతి ప్రశ్నకు వేరుగా మార్కులు ఉంటాయి. కానీ ప్రతి తప్పు
సమాధానానికి ఉన్న మార్కులలో మూడో వంతు నెగటివ్ మార్కులు ఉంటాయి. పేపర్ ఎలా
వచ్చినా 40 + మార్కులు చాలా మంచి స్కోర్‌గా పరిగణించ బడుతుంది.
table5 కొన్నేళ్లుగా పరీక్ష తీరు.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ
ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఎప్పుడు కూడా చాలా లెక్కలు చేసే విధంగా
ఉంటుంది. కొన్నిసార్లు వేదిక్‌మ్యాథ్స్ టెక్నిక్స్ నుంచి ప్రశ్నలు
డైరెక్ట్‌గా కూడా అడిగారు. అందుకే అందరు కూడా ఈ పరీక్ష కోసం వేదిక్
మ్యాథ్స్, ప్రాథమిక లెక్కింపు పద్ధతులు నేర్చుకోవాలి. కొనిసార్లు ప్రశ్నలు
కాంప్లెక్స్ నంబర్స్ నుంచి కూడా వచ్చాయి. ఇది మిగతా మేనేజ్‌మేంట్
పరీక్షల్లో ఉండవు. కొన్నేళ్లుగా ఈ సెక్షన్ ఇలా ఉంది.
డేటా ఇంటర్‌ప్రిటేషన్
కొన్నిసార్లు ఈ సెక్షన్ వేరుగా వచ్చింది. ఇంకొన్ని సార్లు రీజనింగ్‌లో
భాగంగా వచ్చింది. ఎప్పుడు కూడా ఇవి చాలాకష్టంగా, పెద్దగా, ఎక్కువ సమయం
తీసుకుంటాయి. అందుకే ఏ సెట్ ఎంచుకుంటాం అనేది ఇందులో చాలాముఖ్యం. కొన్ని
సంవత్సరాలుగా ఈ సెక్షన్ ఇలా ఉంది.
table6లాజికల్ రీజనింగ్
అన్నిటికంటే ఈ సెక్షన్ కొంచెం సులువుగా ఉంటుంది. అయితే రక్త సంబంధాలు,
ఇన్‌పుట్ - అవుట్‌పుట్, కోడింగ్ - డీకోడింగ్ లాంటి ప్రశ్నలు తరుచుగా
వస్తాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సెక్షన్ ఇలా ఉంది.
రీడింగ్ కాంప్రెహెన్షన్
ఈ సెక్షన్ కొన్నిసార్లు వెర్బల్‌లో భాగంగా, ఇంకొన్ని సార్లు వేరుగా
వచ్చింది. ఎలా వచ్చినా కూడా, ప్రతి ఏడాది కనీసం నాలుగు ప్యాసేజిలు, ప్రతి
ప్యాసేజిలో కనీసం మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్యాసేజిలు పెద్దగా ఉంటాయి, కానీ
పెద్ద కష్టంగా ఉండవు. కొన్నేళ్లు ఈ సెక్షన్ ఇలా ఉంది.
వెర్బల్ ఎబిలిటీ
లాజికల్ రీజనింగ్‌లాగే వెర్బల్ సెక్షన్ మిగతా సెక్షన్ల కన్నా సులువుగా
ఉంటుంది. ప్రశ్నలు పదజాలం, వ్యాకరణం, పారా జంబుల్స్ వంటి వాటి నుంచి
ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్నల్లో లాటిన్ పదాలతో విద్యార్థులు ఆశ్చర్యానికి
గురి కావొచ్చు.
జనరల్ నాలెడ్జ్
చాలామంది విద్యార్థులు ఈ సెక్షన్లో నష్టపోతారు. ప్రశ్నలు సులభంగా ఉన్నా
కూడా జనరల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారు.
అంతేకాదు ఈ సెక్షన్ క్యాట్‌లాంటి వేరే పరీక్షల్లో ఉండదు. కాకపోతే ఈ
సెక్షన్‌లో కటాఫ్ ప్రతి ఏడాది చాలా తక్కువగా ఉంది. సాధారణంగా ఇందులో మ్యాచ్
ది ఫాలోయింగ్ లాంటి ప్రశ్నలు ఉంటాయి. కొన్నేళ్లుగా ఈ సెక్షన్ ఇలా ఉంది.
table7IIFT కోసం సరైన వ్యూహం
అభ్యాస్ నుంచి చాలామంది విద్యార్థులు కొన్ని ఏళ్లుగా ఈ ప్రతిష్ఠాత్మక
కళాశాలలో ఎంపిక అయ్యారు. వారితో మాట్లాడడం, గత కొన్నేళ్లుగా పరీక్ష రాసిన
వారిన అనుభవం, గత సంవత్సర కటాఫ్‌ల ఆధారంగా మేము ఈ పక్క టేబుల్ ఇస్తున్నాం.
ముఖ్యమైన తేదీలు
IIFT 2014 నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ఆన్‌లైన్ (ఒక క్రెడిట్ కార్డ్
/ డెబిట్ కార్డ్ / డిమాండ్ డ్రాఫ్ట్ ఉపయోగించి) లేదా పోస్ట్ ద్వారా
చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొనేవారు, దరఖాస్తు కాపీ IIFT అడ్మిషన్
కార్యాలయానికి సెప్టెంబర్ 3వ తేదీ లోపు పంపాలి. ఈ సంవత్సరం IIFT పరీక్ష
నవంబర్ 23న జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం ww.iift.edu వెబ్‌సైట్ చూడండి.