ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మంగళవారం అధికారం లో వంద రోజులు పూర్తి
చేసింది. దీనిలో రకరకాల విజయాలూ,కొద్దిపాటి వైఫల్యాలూ ఉన్నాయి. మోడీ
ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకు నేందుకు చేసిన
వివిధ సర్వేల ఫలితాలు, ప్రజలు మొత్తం మీద ఆనందాన్నే వ్యక్తం చేస్తున్నారన్న
విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో
ప్రభుత్వ వైఫల్యం పట్ల నిరాశ వ్యక్తం చేసినట్టు వెల్లడ యింది.లోక్‌సభ
ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్దాల
అనంతరం తనంత తానుగా మెజారిటీ సాధించిన ఏకై క పార్టీగా బీజేపీ బలపడింది. మే
26వ తేదీన దేశ 14వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ప్రజలకు మంచి రోజులు
తెస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయనే విమర్శకులపై ఆగ్రహం వక్తం
చేస్తూ, ఇంకా తాము కుదరుకోకముందే వారు మంచి రోజులు వచ్చాయా అని
ప్రశ్నిస్తున్నారని ఫిర్యాదు చేసారు. ప్రాథమికంగా విమర్శ లు సద్దు మణిగిన
తర్వాత ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ట్రపతి ప్రణబ్
ముఖర్జీ చేసిన ప్రసంగం ద్వారాను, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారాను
ప్రభు త్వం పలు
హామీలను, పథకాలను ప్రకటించింది. ప్రజలకు ఆనందం కలిగించిన నిర్ణయాల్లో
ప్రణాళికా సంఘం రద్దు, దేశంలోని పత్రి కుటుంబానికి బీమా సౌకర్యంతో ఉన్న
బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పన వంటి వాటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు.
తూర్పు దేశాలతో సంబంధాలపై ఆశక్తి
మోడీ విదేశాంగ విధానాన్ని చూస్తే ఆయన తూర్పు దేశాల వైపు దృష్టి సారించే
విధానాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. జపాన్ పర్యటనకు వెళ్లి
అక్కడి నుంచి 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడుల హామీలను సాధించుకు వచ్చిన ఆయన
ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెలలో నిర్వహించనున్న భారత
పర్యటనకు ఎదురుచూస్తు న్నారు. మామూలు సంబంధాలు ఉన ్న జ పాన్, అంతంత మాత్రం
సంబంధాలు ఉన్న చైనాతో వాణిజ్యం నెరపాలని మోడీ భావిస్తున్నారు. కాగా పలు
సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ వస్తున్న పాకిస్తాన్‌తో
కార్యదర్శి స్థాయి చర్చల రద్దుకు పూనుకున్న భారత్ వైఖరి ఆ దేశంతో కఠినంగా
వ్యవహరించాలన్న వారికి ఆనందం కలిగించింది.
నిత్యావసరాల ధరలు
దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణ లో ప్రభుత్వం విఫలమయింది. ఏ
మాత్రం అదుపులోకి రాని నిత్యావసరాల ధరలకు దేశంలోని చాలా ప్రాంతాల్లో
నెలకొని ఉన్న వర్షాభావ పరిస్థితులు తోడయ్యా యి. ప్రభుత్వాల గెలుపోటములు
నిర్ణయించడంతో సైతం ప్రభావం చూపే ఉల్లి ధర పెరుగుదల ప్రభుత్వానికి ఆందోళన
కారణమయింది.
ధరల పెరుగుదలతో పాటు ప్రభుత్వానికి ఆందోళన కలిగించిన అంశం ప్రాధాన్యతల
విషయంలో సవ్యంగా వ్యవహరిస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన మతపరమైన అల్ల్లరు మోడీ ప్రభుత్వంపై
నీలినీడలకు కారణమయింది.
అన్నీ సానుకూలంగా ఉన్నాయన్న ఆలోచన లోఉన్న సమయంలో గత నెల బీజేపీకి గట్టి
దెబ్బ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లోని 18 అసెంబ్లిd సీట్లకు జరిగిన ఉప
ఎన్నికల్లో బీజేపీ సాధారణం కన్న తక్కువ స్థాయిలో ఫలితాలు సాధించింది.
తానిచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని, ప్రజలు సత్వర ఫలితాలకై ఎదురు
చూస్తున్నారన్న విషయం వ్యక్తమయింది.
ముందున్న పెద్ద్ద సవాల్
కాగా మునుముందు మోడీ ప్రభుత్వానికి మరో పెద్ద్ద సవాల్ ఎదురుకానుంది.
అక్టోబర్, డిసెంబర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు జరుగుతున్న ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు.
హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో జరిగే అసెంబ్లిd మోడీ
ప్రభుత్వం పనితీరుకు రిఫరెండంగా పేర్కొనవచ్చు.