శరీరంలోని ప్రధాన జీవక్రియలన్నింటినీ నియంత్రించే ఒక కేంద్ర బిందువు
థైరాయిడ్ గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియలకు అవసరమైన
హార్మోన్లన్ని ఈ గ్రంథిలోనుంచే ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు రక్తంలో
కలిసి శరీరమంతా తమ విధులు నిర్వహిస్తూ ఉంటాయి. పిల్లల శారీరక మానసిక
ఎదుగుదలలో ఈ హార్మోన్ల పాత్ర కీలంకంగా ఉంటుంది. ఇక గుండె, జీర్ణవ్యవస్థ,
విసర్జన లాంటి జీవక్రియలన్నింటినీ ఈ హార్మోన్లు క్రమబద్ధం చేస్తాయి. అయితే
శరీరంలో ఈ హార్మోన్నల పరిమాణం తగ్గిపోయినపుడు జీవక్రియల వేగం కూడా
తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు.
ఒక వేళ ఈ హార్మోన్ల పరిమాణం పెరిగిపోతే జీవక్రియల వేగం కూడా పెరిగి
పోతుంది. ఇలా పెరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. శరీరంలో వ్యాధినిరోధక
శక్తిని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ యాంటీ బాడీస్ ఉత్పన్నం కావడమే ఈ హార్మోన్
హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం.
హైపోథైరాయిడిజం - నిజానికి హార్మోన్లు తగ్గిపోవడమే ఎక్కువ మంది ఎదుర్కొనే
సమస్య. పురుషుల్లో కన్నా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ
సమస్యలో థైరాయిడ్ గ్రంథికి విరుద్ధంగా శరీరంలో కొన్ని యాంటిబాడీస్
పెరుగుతాయి. ఫలితంగా గ్రంథి
క్రమంగా క్షీణిస్తూ పోతుంది.
ఆ క్రమంలో శరీర క్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోతాయి. అయినా చాలా కాలం
దాకా ఈ వ్యాధి లక్షణాలేవీ స్పష్టంగా కనిపించవు. ఒక్కోసారి నెలలు, ఏళ్లు
గడిచిన వ్యాధిగ్రస్తులు తమ సమస్యను గుర్తించలేరు.
ఎలా తెలుస్తుంది?
తొందరగా అలసిపోవడం, కాళ్లు చేతుల్లో నొప్పులు, మలబద్ధకం, శరీరం బరువు
పెరిగిపోవడం, వాతావరణం ఏ కాస్త చల్లగా ఉన్నా విపరీతంగా వణికి పోవడం, ముఖం
పాదాల్లో వాపు రావడం, పగటి వేళ ఎక్కువగా నిద్ర రావడం వంటి లక్షణాలు
కనిపిస్తాయి. వీటితో పాటు చర్మం పాలిపోవడం, జుట్టు రాలిపవోడం వంటివి కూడా
ఉంటాయి. మహిళల్లో ఈ హార్మోన్ లోపాలు ఉంటే నెలసరి సమస్యలు తలెత్తుతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలు గర్భం ధరించినపుడు వీరి హార్మోన్లను సాధారణ
స్థాయిలో ఉంచడానికి మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే తల్లిలోని ఈ
లోపం గర్భంలోని శిశువు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. హార్మోన్లు తక్కువగా ఉంటే
అసలు గర్భమే రాకుండా పోవచ్చు.
ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు.
ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే వారి శారీరక మానసిక
వృద్ధి కుంటుపడుతుంది. థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇది అధిక
రక్తపోటుకు కొలెస్ట్రాల్ పెదగడానికి దారి తీయవచ్చు. పైగా గుండె చుట్టు నీరు
చేరి కొన్ని గుండె జబ్బులకు కూడా కారణం కావచ్చు. హార్మోన్లు తక్కువగా ఉన్న
వారిలో ఆకలి మాములుగానే ఉంటుంది. కానీ, తీసుకున్న ఆహారంలోని కాలరీలు చాలా
తక్కువగా ఖర్చు అవుతాయి. అందువల్ల మీరు ఎంత తక్కువగా తిన్నా కూడా శరీరం
బరువు పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు చికిత్సల విషయంలో
నిర్లక్ష్యంగా ఉండకూడదు.
హైపర్ థైరాయిడిజం
హార్మోన్లు అవసరానికి మించి ఉత్పన్నం కావడం ఇందులోని సమస్య. కాకపోతే ఈ
సమస్య చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న వారిలో గొంతు
భాగంలో వాపు కళ్లు ఉబ్బెత్తుగా బయటికి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీరిలో జీవక్రియల వేగం పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు
కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి. అందుకే ఎంత తిన్నా శరీరం బరువు
తగ్గిపోతూనే ఉంటుంది. దీనికి తోడు కాళ్లు చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ
వేగం పెరగడం గుండె దడ మొదలువుతాయి. ఎముకల నుంచి కాల్షియం బయటికి
వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య. వీరిలో జీవక్రియల వేగం బాగా పెరిగిపోతుంది.
విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి అందుకే
ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది, దీనికి తోడు కాళ్లు చేతులు
వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం, గుండె దడ మొదలవుతాయి. ఎముకల నుంచి
కాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య.
దీని వల్ల ఎముకలు బాగా బలహీన పడుతాయి. రక్తపోటు సాధారణంగా ఉంటుంది. కానీ,
భావోద్వేగాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే
కళ్లు మరింతగా పొడుకువస్తాయి. కళ్లలలో తెమ తగ్గి ఎర్రబడతాయి.
తొలుత సాధారణ దృష్టి లోపాలు ఏర్పడినా ఒక దశలో చూపు పూర్తిగా పోయే ప్రమాదం
ఉంది. ఈ వ్యాధిలో గుండె వేగం బాగా పెరగడం వల్ల గుండె దెబ్బ తినే అవకాశం
కూడాఉంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే హోమియో నిపుణులను
సంప్రదించాలి. సాకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి వల్ల వచ్చే
దుష్పరిమాణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.