ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాషా్ట్రలలో కౌన్సెలింగ్‌ జరగబోతోంది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు మంగళవారం రాత్రి ఇందుకోసం జీవో నెం 42ను విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ ఐదవ తేదీ వరకు జరగనుంది. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 30, 31 సెప్టెంబర్‌ ఒకటో తేదీల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సెప్టెంబర్‌ 2, 3, 4, 5 తేదీలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సమయం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది రెండు రాషా్ట్రలలో ఐదు సెంటర్లలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ, విశాఖలోని ఆంధ్రా యూనవర్సిటీ, విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలలో కౌన్సెలింగ్‌ జరగనుంది. ఎన్‌సీసీ, ఆర్మీ కేటగిరీ అభ్యర్థులకు సెప్టెంబర్‌ 7వ తేదీన, క్రీడల కేటగిరీ, వికలాంగులకు, పోలీస్‌, సైన్యంలో పనిచేస్తున్న వారి పిల్లలకు 8న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది స్విమ్స్‌లోని పద్మావతి మహిళా మెడికల్‌ కాలేజీలో అదనంగా పెరిగిన 150 సీట్లను కూడా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది.
30వ తేదీన ఒకటవ ర్యాంకు నుంచి 1500 వరకు, 
31న 1501 నుంచి 4500 వరకు, 
 సెప్టెంబర్‌ ఒకటిన 4501 నుంచి 8500 ర్యాంకుల వరకు పొందిన అభ్యర్థులు హాజరు కావాలి. 
రిజర్వు కేటగిరీ అభ్యర్థులు 
 సెప్టెంబరు 2న ఒకటి నుంచి 3000 ర్యాంకుల వరకు, 
3న 3001 నుంచి 6500 వరకు, 
4న 6501 నుంచి 10వేల వరకు, 
5న 10001 నుంచి 25 వేల ర్యాంకు వరకు హాజరు కావాలి.

Followers