ఇస్లామాబాద్, నవంబర్ 13: భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకోగల
అణుక్షిపణిని పాకిస్థాన్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. 1500
కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగల ఈ క్షిపణికి అణు,
సంప్రదాయ వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యముంది. హతాఫ్-6గా కూడా పిలిచే ఈ
మధ్యశ్రేణి షహీన్-2 మిస్సైల్‌ను అరేబి యా సముద్రం నుంచి పరీక్షించినట్టు
పాక్ సైన్యం తెలిపింది.