నరేంద్ర మోడీని వెనక్కి నెట్టిన ఫెర్గు్యసన్‌

వాషింగ్టన్‌: టైమ్‌స మేగజైన్‌ చేపట్టిన ప్రతిష్టాత్మక పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. నవంబర్‌ 26వ తేదీ వరకు మొత్తం పోలైన ఓట్లలో 11.1 శాతం ఓట్లతో ఆయన తొలి స్థానంలో ఉంటూ వచ్చారు. అప్పటి వరకు 8.8 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్న ఫెర్గు్యసన్‌ ప్రొటెస్టర్‌సకు భారీ మద్దతు లభించడంతో మోడీ ద్వితీయ స్థానానికి వచ్చారు. ఫెర్గు్యసన్‌లో నిరాయుధీయుడైన ఓ నల్లజాతి పౌరుడిని ఓ శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చి చంపిన సంఘటన అమెరికాను కుదిపేస్తోంది. దీనికి నిరసనగా ఉద్యమకారులు ఈ బరిలో నిలిచారు. అయితే, సదరు పోలీసు అధికారి పైన విచారణ చేపట్టేందుకు విస్తౄత న్యాయసమితి ససేమీరా అనింది. దీంతో, ఫెర్గు్యసన్‌ ప్రొటెస్టర్‌సకు ఒక్కసారిగా భారీగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మోడీకి 9.8 శాతం, ఫెర్గు్యసన్‌ ఉద్యమకారులకు 10.8 శాతం ఓట్లు ఉన్నాయి. హాంకాంగ్‌ ప్రజాస్వామ్య ఉద్యకారుడు జాషువా వాంగ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. నోబెల్‌ విజేత మలాలా నాలుగో స్థానంలో ఉంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమర్‌ పుతిన్‌ 5 స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షులు బరాక్‌ ఒబామా బాగా వెనుకబడ్డారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్‌ 6 వరకు ఈ పోల్‌ జరగనుంది. విజేతను 8వ తేదీన వెల్లడిస్తారు. 10న టైమ్‌స మేగజీన్‌ సంస్థ ప్రకటన చేయనుంది. ఫెర్గూసన్‌ పోలీస్‌ రాజీనామా అమెరికాలో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన తెల్లజాతి పోలీస్‌ అధికారి డారెన్‌ విల్సన్‌(28) ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయినా నల్లజాతి ఉద్యమకారులు శాంతించడం లేదు. తమ ఉద్యమం డారెన్‌ ఉద్యోగం ఊడగొట్టడం కోసం కాదని, బ్రౌన్‌కి న్యాయం జరిపించేందుకు పోరాడుతున్నామని, తక్షణం డారెన్‌ని అరెస్టు చేసి శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. డారెన్‌ రాజీనామాను అధికారులు ఆమోదించారు.

Followers