జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)కి బదులుగా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, రాత పరీక్షల విధానం, తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులతోనేనోటిఫికేషన్ జారీ చేయాలన్న ఆలోచనతో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం అనుమతిస్తే సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల భర్తీచేపట్టాలని, లేదంటే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలను పరిశీలించాలని కమిషన్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, విభాగాలవారీగా గ్రూప్-2 ఖాళీల వివరాలు సర్వీస్ కమిషన్‌కు ఇంకా అందించాల్సి ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని కమిషన్ సభ్యులు తెలిపారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తిచేసి మరో రెండు వారాల్లో ఏదో ఒక నోటిఫికేషన్ జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వరుసగా నోటిఫికేషన్లు: టీచర్, గ్రూప్-2 నోటిఫికేషన్లకు మొదటి ప్రాధాన్యంఇస్తున్నప్పటికీ త్వరలోనే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీచేసే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన టీఎస్‌ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో కూడా భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. పోలీస్, జైళ్లు, ఆరోగ్యశాఖల్లోని ఖాళీల భర్తీకి కూడా భారీ సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా మొత్తం 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ కసరత్తు చేస్తున్నది

Followers