ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేకడెహ్రాడూన్: భారత్-బంగ్లా భూ సరిహద్దు
ఒప్పందం బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం... ఆ దేశంతో
భారత్ మైత్రికి బలమైన సందేశమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. జాతీయ
ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని ఇది
సూచించిందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక
సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చట్టసభల పనిదినాలు
తక్కువగా నమోదవుతుండటంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన... సభా కార్యకలాపాలకు
అంతరాయం కలిగించకూడదంటూ శాసనకర్తలకు సూచించారు. పార్లమెంటు, రాష్ట్ర
శాసనవ్యవస్థలు ఏటా 100 రోజుల పనిదినాలను కలిగిఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో
'త్రీడీ': ప్రజాస్వామ్యంలో డిబేట్(చర్చ), డిస్సెంట్(భిన్నాభిప్రాయం),
డెసిషన్(నిర్ణయం) అనే మూడు 'డీ'లు ఉండాలని ప్రణబ్ పేర్కొన్నారు.
డిస్‌రప్షన్(అంతరాయం) అనే 'డీ' ఉండకూడదన్నారు. ప్రజలే తమ ప్రభువులన్న
విషయాన్ని శాసనకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.