
పర్వతారోహకులు ప్రపంచంలోని పర్వత శిఖరాలను అధిరోహించడం తెలిసిందే. అయితే నార్వేలోని ట్రాల్‌టుంగా పర్వతంపైకి చేరుకోవాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే శిఖరం ఒక వైపు అంచు పర్వతశ్రేణుల్లో వుండి మిగతా మూడువైపులా ఎటువంటిపట్టువుండదు. దూరం నుంచి చూసేవారికి ఎలాంటి ఆధారం లేని బండపైన వున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రదేశం రింజ్‌డల్స్‌వాట్‌నెట్ సరస్సుకు సమీపంలో వుంది. నిత్యం ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అనేకమంది సాహసయాత్రికులు వస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం.