ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన టాప్ 20 నగరాల్లో భారత్
కు చెందిన 13 నగరాలను గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ పట్టికలో చైనా నుంచి కేవలం
3 నగరాల్లో మాత్రమే ఉన్నాయి. భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం ఫలితంగా
సుమారు 66 కోట్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 3.2 సంవత్సరాలు తరిగిపోతోందని
అధ్యయనాల్లో తేలింది. అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది. టాప్ 10
కాలుష్య నదుల్లో గంగా, యమునా ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదులుగా
పేరొందిన టాప్ 10 నదుల్లో గంగా, యమున నదులను కూడా పేర్కొన్నారు. ఇదిలా
ఉంటే చైనా నుంచి మాత్రం కేవలం ఒక నది మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఫిబ్రవరిలో
విడుదల చేసిన మరో జాబితాలో గుజరాత్ లోని వాపీ, ఒడిషాలోని సుకిందా
నదీపారివాహిక ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా
గుర్తించింది. ఇక దేశంలో 290 నదుల్లో కాలుష్య ప్రభావితమైనవిగా గుర్తించారు.
దీని ప్రభావం నేరుగా 8వేల 400 కి.మీ పరిధిలోని జనావాసాలపై పడుతోంది.
పారిశ్రామికంగా భారత్ చైనాలు పోటీ భారత్ చైనాలు ఆర్థిక శక్తిగా
ఎదిగేందుకుగానూ పలు రంగాల్లో పోటీ పడుతున్నాయని ప్రపంచ విపణిలో గత
రెండుదశాబ్దాలుగా ఉన్న మాటే ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధిలో భారత్ చైనాలు పోటీ పడుతున్నాయి. కర్బన
ఉద్గారాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే భారత్ మూడో స్థానంలో
ఉంది. అటు చైనా ప్రపంచ ఉత్పత్తి రంగానికే తల మాణికంగా నిలిచింది. ఈ
పరిణామంలో భారత్ చైనాల్లో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్య
నివారణకు చైనా కఠిన చట్టాలు ఇరు దేశాల్లో గత దశాబ్దం వరకూ కాలుష్య సూచీల్లో
సమాన స్థాయిలో గణాంకాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చైనా మాత్రం భారత్ కన్నా
పరిస్థితిని మెరుగుపరుచుకుంది. గడిచిన పదేళ్లలో చైనా నదీ జలాల కాలుష్యాన్ని
తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టింది. ఇక వాయు
కాలుష్య నివారణకు చైనా కఠినమైన చట్టాలు అమలు చేసింది. గత పదిహేనేళ్లతో
పోల్చి చూస్తే బీజింగ్ నగరంలో 40 శాతం వాయు కాలుష్యం తగ్గింది. సరిగ్గా
పదిహేనేళ్ల కాలంలో మన దేశరాజధాని ఢిల్లీలో 20 శాతం వాయు కాలుష్యం
పెరిగింది. మన దేశంలో కేవలం కోయంబత్తూరు మాత్రమే కాస్త కాలుష్య సూచీల్లో
కాస్త మెరుగ్గా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.
కానీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలను మాత్రం నియంత్రించడం
లేదు. ఫలితంగా సుమారు 66 కోట్ల మంది భారతీయుల ఆయుర్దాయం సగటున 3.2
సంవత్సరాలు తగ్గిపోయిందనే చేదు నిజం బయట పడింది.