ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ పాపులేషన్
స్టెబిలైజేషన్ ఫండ్(ఎన్‌పీఎస్‌ఎఫ్) భారత జనాభా నివేదికను విడుదల
చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత
జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి
1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే
2050 నాటికి భారత్ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే
మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో
మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు.
అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్‌లాంటి
దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం