మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగులు ఎంత
గానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లకు మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే.
నోటిఫికేషన్ల విడుదల ముందుకు చేయాల్సిన ప్రక్రియ మరికొంత జరగాల్సి ఉంది.
దీంతో పాటుగా మొదటి సారి ఉద్యోగాల భర్తీకి శ్రీ కారం చుడుతున్నందున ఈ సారి
కొంత జాప్యం తప్పదని సూచిస్తున్నారు. అధికారిక ప్రక్రియలో ఏమైనా లోపాలు
జరిగితే కోర్టుకు వేళ్లితే మొదటికే మోసం వస్తుందని… అందుకు కొద్దిగా
అలస్యమైనా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నోటిఫికేషన్ విడుదల చేయాలనే
ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగా భర్తీకి కొంత వరకు లైన్
క్లియర్ చేసింది. అయితే అంతర్గతంగా ఇంక కొంత ప్రక్రియ జరగాల్సి ఉందని
చేబుతున్నారు.
సర్వీస్ కమిషన్ విడుదల చేసే ఉద్యోగాలకు
స్కీమ్ ఎగ్జామినేషన్ ను ఖరారు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ జీవో కూడా విడుదల చేశారు. ఇక
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌ను ప్రకటిం చాల్సి ఉంటుంది. సిలబస్‌ను
ప్రకటించడానికి కమిషన్ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో
సబ్జెక్టులో నిపుణులైన వారిచే సంప్రదింపులు జరుపుతు న్నారు. అయితే ఈ
కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. సిలబస్
కొలిక్కి వచ్చినా ముందుగా ఏ పోస్టులను భర్తీ చేయనున్నారో ఆ పోస్టులకు
సంబంధించిన సిలబస్ ను మాత్రమే ప్రకటించాలని గతంలోనే టిఎస్‌పిఎస్‌సి
నిర్ణయించింది. దీని వల్ల కోచింగ్ సెంటర్ల దోపిడికి, నిరుద్యోగులను
మభ్యపెట్టే సంస్థలకు అడ్డుకట్టవే యగలుగుతామని అంచనాతో ఈ నిర్ణయం
తీసుకున్నారు.
దీని వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో
పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించవాళ్లం
అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ ప్రకటన తరువాత
విద్యార్థులు ప్రిపేర్ కావడానికి కొంత సమయం ఇవ్వాలనే డిమాండ్
వినిపిస్తోంది. ఈ సారి తెలంగాణ కోణంలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్
రూపొందించినందున కొత్త సిలబస్ ఎక్కువగా ఉంటుందని.. దాని కోసం సమ యం
ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వినతిని అంగాకరిం చాల్సిందేనని నిపుణులు సైతం
సూచిస్తున్నారు. సిలబస్ ప్రకటన తరువాత పేపర్ సెట్టింగ్ కోసం నిపుణులు సంప్ర
దింపులతో అధిక సమయం పడుతుందని చేబుతున్నారు.
కొందరు జీవోలు విడుదల కాగానే అంత అయి
పొయినట్లుగా భావిస్తున్నారని… ఆ జీవోలు ఆర్ధిక శాఖ ఆమోదం పొందడం .. ఆ
తరువాత శాఖాధిపతుల నుంచి అనేక వివరాలతో లేఖ సర్వీస్ కమిషన్ కు చేరడానికే
ఎక్కు వ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కోర్టుల్లో సమస్యలు రాకుండా
అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉం టుందని.. దీని కోసమే అధిక సమయం పడుతుందం
టున్నారు. ఇలా పలు రకాల అధికారిక ప్రక్రియలు పూర్తి అయి నియామక
నోటఫికేషన్‌లు రావడదానికి నిరుద్యో గులు ఉహించినంత తొందరగా సాధ్యం కాదని
చేబుతున్నారు. దీంతో ఆగస్టు చివరి వరకు మొదటి నోటిఫికేషన్‌కు ఎదురుచూడక
తప్పదు.
54 సంవత్సరాలకు ఉద్యోగమా…!
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న వయో పరిమతిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో రాబోయే ఒక సంవత్సరం పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తరువాత పాత వయో పరిమితి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనరల్ కేటగిరి వారికి 34 సంవత్సరాల వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, వారికున్న 39 సంవత్సరాలను 49కి, వికలాంగులకు 54 సంవత్సరాల వయస్సు వారికి అవకాశం రానుంది. అయితే వయో పరిమితి పెంపుతో 54 సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే వారికి ఉద్యోగం వచ్చినా… నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
బీసీ, ఎస్‌సి, ఎస్‌టి 49 సంవత్సరాలకు
ఉద్యోగం వచ్చినా మరో 9 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయనున్నారు. ఇలా అతి
తక్కువ కాలం ఉద్యోగంలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. కనీసం 20
సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్న వారికే పెన్షన్ వస్తుందని గుర్తుచేస్తున్నారు. ఆ
వయస్సు వారు ఇప్పటికే జీవితంలో స్థిరపడి ఉంటారని.. వారి పిల్లలు కూడా
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి అర్హత సాధించి ఉంటారని… ఈ సమయంలో అవకాశం
రావడంతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చంటున్నారుఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న వయో పరిమతిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో రాబోయే ఒక సంవత్సరం పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తరువాత పాత వయో పరిమితి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనరల్ కేటగిరి వారికి 34 సంవత్సరాల వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, వారికున్న 39 సంవత్సరాలను 49కి, వికలాంగులకు 54 సంవత్సరాల వయస్సు వారికి అవకాశం రానుంది. అయితే వయో పరిమితి పెంపుతో 54 సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే వారికి ఉద్యోగం వచ్చినా… నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.