వాహనాలకు నచ్చిన నెంబర్ రిజర్వు చేసుకోండిలా..


vaahanaalaku nachhina nembar rijarvu chesukondila..


వాహనాలు కొనుగోలు చేసినవారు స్టేటస్ కోసం ఒకరు, లక్కీ నెంబర్ కోసం మరొకరు ఇలా కారణమేదైనా ఫ్యాన్సీ నెంబర్లు తమ వాహనాలకు ఉండాలని కోరుకుంటున్నారు. వీటి కోసం ఎంత మొత్తానైనా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. కోరుకున్న నెంబర్ సొంతం కావాలంటే వాహనదారులు ఏం చేయాలి. ఎంత చెల్లించాలనే సందేహాల గురించి కింది విషయాలు తెలుసుకుంటే సరి... రోడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఏయే నెంబర్లు రిజిస్ట్రేషన్లకు అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలను సంబంధిత అధికార వెబ్‌సైట్లలో పొందుపరుస్తోంది. ఇందుకోసం తెలంగాణ ట్రాన్స్‌పోర్టు వెబ్‌లో రిజర్వేషన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి, లేదా WWW.transport.telangana.gov.in/htm/ reservationnumber.php వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఉన్న నెంబర్లు కనిపిస్తాయి. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నెంబర్లు పీడీఎఫ్ ఫైల్‌లో ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సిన నెంబర్‌ను ఎంచుకుని రిజర్వు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నంబర్ల వద్ద R అని ఉంటే ఆ నంబరు రిజర్వు అయిపోయిందని అర్థం. వాటిని తప్ప మీరు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. రిజర్వు చేసుకోండిలా.... వాహన చట్టం 1989 ప్రకారం నంబర్‌ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు. ఇందుకు రిజర్వేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ నంబర్ దరఖాస్తును పూరించాలి. మీ వాహన వివరాలు, అడ్రస్ ప్రూఫ్, కోరుకుంటున్న నెంబర్, బ్యాంకు డీడీ వివరాలు పొందుపరచాలి. డీడీని లోకల్ కార్యాలయం పేరుపై తీయాలి. ఆర్‌టీఐ కార్యాలయంలో ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేయాలి. మధ్యాహ్నం 1 గంట లోపు దరఖాస్తును అందించాలి. నెంబర్‌కు మూడు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని పరిశీలించి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆక్షన్ వేస్తారు. ఆక్షన్‌లో ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధ్దపడతారో వారికి నెంబర్ కేటాయిస్తారు. అలాట్ చేసిన రిజర్వు నెంబర్‌ను 15 రోజుల్లో వాహనంతో సహా అధికారి ఎదుట హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌కు అనుమతించరు. డబ్బులు కూడా వాపసు ఇవబడవు. ఏ నెంబర్‌కు ఎంత? 9, 999, 9999 నెంబర్లకు రూ.50వేలు - 99,333,555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 నెంబర్లకు రూ.30వేలు 5, 6, 7, 111, 234,306, 405, 789, 818, 909, 1188, 1234,1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4545, 4554, 4567, 4599, 5678, 63366633, 6789, 7227, 7722, 8118,8811, 9009, 9099 నెంబర్లకు రూ.10వేలు చెల్లించాలి. ఎలాంటి నెంబర్లకు అయినా ఫోర్ వీలర్లకు రూ. 5,000, టూ వీలర్లకు రూ. 2000 డీడీ తీయాలి. నెంబర్‌ను టూవీలర్, ఫోర్‌వీలర్లకు దరఖాస్తు చేసుకుంటే ముందస్తు ప్రాధాన్యం ఫోర్ వీలర్‌కు ఇస్తారు



Followers