మూడు పదుల వయసు దాటినా ముదురు భామ శ్రియ.. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన
క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. అందులో భాగంగా తాజాగా అమ్మడు ఓ బంపర్ ఆఫర్
కొట్టేసిందని సమాచారం. బాహుబలి రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం శ్రియను
ఎంపిక చేశారని వినిపిస్తోంది.
బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలికి సీక్వెల్ గా బాహుబలి పార్ట్-2
తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో
నటించే అవకాశం శ్రియకు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఈ
మూవీలో శ్రియ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయం పై రకరకాల ఊహాగానాలు
వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బాహుబలి-2 కథని కీలక మలుపు తిప్పే పాత్రలో శ్రియ కనిపించబోతుందని
టాక్. అయితే బాహుబలిలో రానా భార్య ఎవరో రివీల్ చేయలేదు జక్కన్న. దాంతో ఆ
పాత్రకే శ్రియను సెలెక్ట్ చేశారని వినికిడి. అంతేకాదు ఈ క్యారెక్టర్ లో
కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. ఏదేమైనా ఈ న్యూస్ నిజమైతే భల్లాలదేవుడి
భార్య నెగెటివ్ పాత్రలో శ్రియకు బంపర్ ఆపర్ దక్కినట్టే. చూద్దాం ఈ విషయం పై
ఎప్పుడు క్లారిటీ వస్తుందో!