ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కితే కష్టమే!

వేడెక్కితే కష్టమే!

అసలే వేసవి కాలం. ఎండలు ముదురుతున్నాయి. వాతావరణం వేడెక్కుతోంది. ఉష్ణతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత ఉపశమనం కలిగితే బాగుండునని చల్లని ఉపకరణాల కోసం తహతహలాడుతున్నారు. వేసవి మొదట్లోనే ఇలా ఉంటే... ఇక మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వినియోగించే వారికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒకవైపు సూర్య తాపం, మరో వైపు ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే వేడి... వీరిని ఇబ్బంది కలిగిస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం... స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ యూజర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఓవర్‌హీట్‌.
ముఖ్యంగా బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లలో ఇది ఉత్పన్నమవు తోంది. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకూ ఈ సమస్య తలెత్తుతోంది. ఫోన్‌లో ఎక్కువ సేపు వీడియో కాల్స్‌ చేయడం, గ్రాఫికల్‌ గేమ్స్‌ ఆడటం, యూట్యూబ్‌ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేయడం వల్ల ఓవర్‌హీట్‌ సమస్య వస్తుంది. దీనిని ఎదుర్కొనేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే... - ఫోన్‌లో అవసరం లేని కనెక్టివిటీ సర్వీసులను డిసేబుల్‌ చేయడం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.- 3జీ, 4 జీ వంటి ఇంటర్నెట్‌ మొబైల్‌ డేటా సేవలను గంటల కొద్దీ వినియోగించచడం వల్ల ఓవర్‌ హీట్‌ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్‌ తప్పనిసరి.- ఫోన్‌లో అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను కిల్‌ చేయడం ద్వారా ఫోన్‌పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.- ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఓవర్‌హీట్‌ సమస్య నుంచి బయట పడొచ్చు. - నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్‌ ఓవర్‌ హీటింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జెన్యున్‌ బ్యాటరీలనే వాడాలి. - వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటూత్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్‌ ప్రాసెసర్‌ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది. - ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్‌ ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించడం ద్వారా ఫోన్‌ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.- ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్‌ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడాల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేకన ఇవ్బండి. - ఫోన్‌ చార్జ్‌ అవుతున్న సమయంలో కాల్స్‌ చేయడం, గేమ్స్‌ ఆడటం, ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం వల్ల ఫోన్‌ ఓవర్‌హీట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లు మానుకోవాలి.- ఇవన్నీ చిట్కాలు పాటించినప్పటికీ మీ ఫోన్‌ ఓవర్‌ హీట్‌ను ఎదుర్కొంటున్నట్లయితే రూటింగ్‌, కస్టమర్‌ ర్యామ్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల పురోగతి సాధించొచ్చు. ల్యాప్‌టాప్‌ కంప్యూటింగ్‌ అవసరాలను సమర్థంగా తీర్చే ల్యాప్‌టాప్‌ ఒక్కోసారి హానికారకంగా మారుతుంది. శరీరంపై పెట్టుకుని ఉపయోగించే పరికరం గనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలు అధ్యాయానాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్‌ ద్వారా వెలువడే 'టోస్టెడ్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనారోగ్య కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ నుంచి వెలువడే వేడి శ రీరాన్ని నల్లగా మార్చడంతోపాటు చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు సందర్భాల్లో నిర్ధారించారు. ల్యాప్‌టాప్‌ ఎందుకు వేడెక్కుతుందంటే.. - దీనిపై ఎక్కువ సేపు పనిచేయడం.- వేడి వాతావరణంలో ఉంచడం.- సరైన వెంటిలేషన్‌ వ్యవస్థ లేకపోవడం.- అనవసరమైన యూఎస్బీ కేబుళ్లు ల్యాప్‌టాప్‌కు ఉంచేయడం.- ల్యాప్‌టాప్‌ను ఉంచిన ప్రదేశంలో దుమ్మూదూళి ఉండటం.- ల్యాప్‌టాప్‌ డిజైనింగ్‌లో లోపం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు - వీలైనంత వరకు ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను వాడొద్దు.- ల్యాప్‌టాప్‌తో ప్రయాణించాల్సి వస్తే ముందుగా ఓ మెత్తటి గుడ్డను తొడలపై ఉంచి ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ను ఆన్‌ చేయండి.- వేడి ఎక్కువ ఉన్న చోట ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తే బ్యాటరీ సమస్య తలెత్తుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు కూడా. కాబట్టి వేడి వాతావరణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంత వరకు ఉపయోగించొద్దు.- ఎండలో పార్క్‌ చేసిన వాహనాల్లో ల్యాప్‌టాప్‌ను ఉంచొద్దు. అలాగే ఓపెన్‌ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చొద్దు.

Followers